రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన .. రాజకీయంగా తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పోక్సో కేసు నమోదు అయినప్పటికీ.. కేంద్రమంత్రి కుమారుడు అయినందుకే.. కాంగ్రెస్ పార్టీ బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయడం లేదంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మీడియా కమ్యూనికేషన్ ఛైర్మన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే నిన్న కరీంనగర్‌ హిందూ ఏక్తా ర్యాలీ యాత్ర సందర్భంగా.. బండి భగీరథ్‌ కేసుపై స్పందించిన బండి సంజయ్.. తప్పు చేస్తే తన కుమారుడిని కూడా శిక్షించాలంటూ చేసిన వ్యాఖ్యలను బుధవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో గుర్తు చేసిన సామ రామ్మోహన్ రెడ్డి.. ఈ వ్యాఖ్యలను తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తన చిత్తశుద్ధిని బండి సంజయ్‌ నిరూపించుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. బండి బండి సంజయ్‌ తన కుమారుడు బండి భగీరథ్‌ను స్వయంగా పోలీసులకు అప్పగించాలని సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌నే వదల్లేదని.. బండి సంజయ్ కుమారుడిని మాత్రం ఎందుకు వదిలేస్తుందని ప్రతిపక్షాలకు సామ రామ్మోహన్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు. బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు విషయంలో.. బీజేపీ నేతలకు, బీఆర్ఎస్ నాయకులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. తనకు ఉన్న అధికార బలంతో ఈ పోక్సో కేసును బండి సంజయ్ తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని సామ రామ్మోహన్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే బండి సంజయ్ తన కేంద్రమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేసి.. తన కుమారుడు విచారణకు పోలీసులకు సహకరించాలని సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సొంత పార్టీలోనే బండి సంజయ్‌కి వ్యతిరేక వర్గం ఎక్కువైందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వారిని వదిలే సమస్యే లేనే లేదని స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు.. సిట్ విచారణను ఎదుర్కొనేందుకు భయం ఎందుకని.. బండి సంజయ్‌ని సామ ప్రశ్నించారు.