భారతదేశ మైనింగ్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా నాయుడు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో బంగారాన్ని ఉత్పత్తి చేసే గని సిద్ధమైందన్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే బంగారంలో దాదాపు 50 నుంచి 60 శాతం వాటా మన రాష్ట్రానిదే కాబోతోందన్నారు. వచ్చే నెలలోనే దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. బంగారం దిగుమతులు విదేశీ మారకపు నిల్వలపై ప్రభావం చూపుతాయన్న చంద్రబాబు.. మన దగ్గరే బంగారం ఉత్పత్తి చేస్తే సమస్యలు ఉండవన్నారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో జొన్నగిరి ప్రైవేట్ గోల్డ్ మైన్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం . వాస్తవానికి మే నెలలోనే దీనిని ప్రారంభిస్తారని భావించినా, కాస్త ఆలస్యమైంది. జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల్లో సుమారుగా. విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ భారీగా పెట్టుబడి పెడుతోంది. కేవలం గోల్డ్ మైనింగ్ మాత్రమే కాకుండా.. జియోమైసూర్ పేరుతో జ్యువెలర్లకే బంగారాన్ని విక్రయించాలని సదరు కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలున్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిశోధనల ద్వారా గుర్తించారు. ఇక్కడున్న మట్టిలో టన్ను మట్టికి.. 1.5 గ్రాముల నుంచి 2 గ్రాముల వరకూ బంగారం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇక మనదేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంగారాన్ని, భారతీయులను వేర్వేరుగా చూడలేని పరిస్థితి. మన దేశం ప్రతి సంవత్సరం సుమారు 700 నుండి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటోంది. ముడి చమురు తర్వాత దీనికోసమే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు ఏకంగా 71.98 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారానికి ఇంత డిమాండ్ ఉన్నప్పుడు.. మనదేశంలో ఉత్పత్తి అయ్యేది మాత్రం కేవలం 1.5 టన్నులే. ఈ నేపథ్యంలో జొన్నగిరి గోల్డ్ మైన్ వంటి ప్రైవేట్ గనులు అందుబాటులోకి వచ్చి.. బంగారం ఉత్పత్తి ప్రారంభమైతే , దిగుమతుల భారం తగ్గుతుంది. అలాగే గోల్డ్ మైనింగ్ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే వీలుంది.