SIR దేశవ్యాప్తంగా మూడో దశ ఎస్ఐఆర్.. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో షెడ్యూల్ ఇదే

Wait 5 sec.

దేశవ్యాప్తంగా మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు గురువారం ఆదేశించింది. ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి డిసెంబరు 23 వరకు కొనసాగతుందని తెలిపింది. ఏపీలో జూన్ 15 నుంచి సెప్టెంబర్ 22 వరకు, తెలంగాణలో జూన్ 25 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా బూత్ లెవల్ ఆఫీసర్ల నియామకం, శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. అనంతరం 2002 జాబితా ప్రకారం ఓటర్ల సవరణకు ఈసీ సిద్ధమైంది. అయితే, తమ ఓటును కోల్పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్‌దేనని ఈసీ స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్ జూన్‌ 5 నుంచి 14 వరకు సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత జూన్ 15 నుంచి జులై 14 వరకు వారు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించనున్నారు. అనంతరం జులై 21న ముసాయిదా జాబితా వెల్లడించారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను స్వీకరించి, మార్పులు చేర్పుల అనంతరం సెప్టెంబర్‌ 22న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు.ఇక, తెలంగాణలో జూన్‌ 15 నుంచి 24 వరకు శిక్షణ, జూన్‌ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే జరుగుతుంది. జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి.. అదే రోజు నుంచి సెప్టెంబర్‌ 28 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్‌ 1న తుది జాబితా ప్రకటించనున్నారు.ప్రస్తుత జనగణన (Census) హౌస్ లిస్టింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఫేజ్-3 షెడ్యూల్ ఖరారు చేసింది. మూడో దశ భాగంగా 3.94 లక్షల మంది బూత్ లెవల్ అధికారులు (BLOs) 36. 73 కోట్ల మంది ఓటర్ల వద్దకు ఇంటింటికీ వెళ్లనున్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్ వాయిదా వేసింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పింది.అలాగే, పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ బూత్‌కు బూత్ లెవల్ ఏజెంట్లను (BLAs) నియమించాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, ఒడిశా, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, హర్యానా, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, ఛండీగఢ్, దాదర్ నగర్ హవేలీ, దమన్ డయ్యూ‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుంది. మొదటి రెండు దశల్లో 13 రాష్ట్రాల్లో 59 కోట్ల మంది ఓటర్లను ఎన్నికల కమిషన్ కవర్ చేసింది.