గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ జన్మదిన వేడుకలు.. మిలియన్ల మందితో ‘ప్రపంచ శాంతి కోసం గురుదేవ్‌తో ప్రపంచ ధ్యానం’

Wait 5 sec.

చూపు వెళ్లినంత దూరం వరకు ఆనందం, సంగీతం, కృతజ్ఞత, భక్తి, ఐక్యత భావాలతో ది అంతర్జాతీయ కేంద్రం కళకళలాడింది. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత్‌తో పాటు మరో 13 దేశాల నుంచి లక్షకు పైగా మంది ఒకచోట చేరారు. ఈ మహాసభలో అత్యంత శక్తివంతమైన క్షణాల్లో ఒకటిగా ‘‘ప్రపంచ శాంతి కోసం గురుదేవ్‌తో ప్రపంచ ధ్యానం’ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పాల్గొన్నారు. ఈ ధ్యానం సరిహద్దులను, కాల మండలాలను దాటి సాగింది. ప్రపంచంలోని వివిధ ఖండాల నుంచి ప్రజలు తమ ఇళ్లలో, కమ్యూనిటీ కేంద్రాల్లో, ప్రజా ప్రదేశాల్లో నుంచి ఆన్‌లైన్ ద్వారా కలిశారు.వివిధ వృత్తులు, సంస్కృతులు, మతాలు, సమాజాలకు చెందిన ప్రజలు ఒకచోట చేరి, జీవితం ఒక వేడుక కావాలని, మానవ విలువలు, కరుణ, అంతరంగ శాంతిపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించాలనే గురుదేవ్ దృష్టిని ప్రతిబింబించే అరుదైన వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే, ఆంగ్లికన్ కమ్యూనల్ చర్చెస్ ఆఫ్ ఇండియా సెఫీ డయోసిస్ ఆర్చ్‌బిషప్ బిషప్ డాక్టర్ మార్విన్ మాథ్యూ, ప్రముఖ తెలుగు సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.సాయంత్రం ధ్యానం, భక్తి సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలు, సామూహిక ఆత్మపరిశీలన క్షణాలతో కొనసాగి, ఉత్సాహభరితమైనప్పటికీ ఎంతో ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. వేడుకలలో భాగంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్రీ స్కూల్స్‌కు చెందిన 150 మంది పిల్లలు హృదయాన్ని హత్తుకునే ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.వేడుకల సందర్భంగా మరో ప్రతీకాత్మక ఘట్టంగ , గురుదేవ్ పంచవటి వనాలకు (వటవృక్షం, రావి, వేప, మామిడి, ఔదుంభర వృక్షాలకు) నీరు పోసి పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం, ప్రకృతిని సంరక్షించడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. ఈ పంచవటి వనాలు సూక్ష్మ పర్యావరణ వ్యవస్థలుగా పరిగణించబడుతూ, గాలి నాణ్యతను మెరుగుపరచడం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం, ప్రశాంతమైన సామాజిక వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడతాయి.గత నాలుగు దశాబ్దాల కంటే ఎక్కువ కాలంగా, గురుదేవ్ దృష్టి మానసిక ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, నదుల పునరుజ్జీవనం, సహజ వ్యవసాయం, విపత్తు సహాయం, ట్రామా కేర్ వంటి అనేక రంగాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ప్రేరణనిచ్చి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసింది.ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నెలరోజుల పాటు జరుగుతున్న వేడుకలలో భాగంగా, అంతర్జాతీయ కేంద్రాన్ని సందర్శించిన అనేక ప్రముఖులు కూడా గురుదేవ్ మానవత్వానికి, అంతరంగ శ్రేయస్సుకు చేసిన సేవలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రయాణాన్ని ‘విశ్వవ్యాప్త చైతన్య వికాసం’గా అభివర్ణిస్తూ, ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది జీవితాలను తాకిందన్నారు. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మాట్లాడుతూ.. గురుదేవ్ జీవితం ‘ఆనందమే ఆధ్యాత్మిక మార్గం’ అని చూపిస్తోందని, కరుణ మానవత్వానికి ఉన్న గొప్ప శక్తుల్లో ఒకటని అన్నారు.బిషప్ డాక్టర్ మార్విన్ మాథ్యూ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నాయని అంటాం, ఎనిమిదో అద్భుతం గురుదేవ్. ఆయన ఎప్పుడూ మతం ఆధారంగా ప్రజలను విభజించరు. బదులుగా, వారు మంచి మనుషులుగా మారేందుకు, తమ మతాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు సహాయపడతారు’’ అని గురుదేవ్ సమగ్రత, విశ్వసౌభ్రాతృత్వ సందేశాన్ని కొనియాడారు.సూపర్‌స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘‘మనిషిగా పుట్టడం ఎంతో పుణ్యమైన విషయం. మనిషిగా జన్మించడం సులభం కాదు. అలా జన్మించిన తర్వాత ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనసు, మంచి ఆలోచనలు కలిగి ఉండటం చాలా కష్టం. ఆ తరువాత తనను తాను తెలుసుకోవాలనే కోరిక కలగడం ఇంకా కష్టం. అటువంటి సమయంలో మనకు మార్గనిర్దేశం చేసే ఒక మంచి గురువును పొందడం చాలా అరుదు. నిజమైన గురువును పొందడం మరింత అరుదు. శ్రీ శ్రీ రవిశంకర్ వంటి మహోన్నత గురువును పొందిన తర్వాత ఈ అవకాశాన్ని మనం కోల్పోవద్దు’’ అన్నారు.అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన ఈ వేడుకలలో గురుదేవ్ బోధనల స్ఫూర్తితో ధ్యానం, సేవ, సామాజిక కార్యక్రమాల ద్వారా తమ జీవితాల్లో వచ్చిన మార్పులను పంచుకున్న అనేక మంది వ్యక్తుల కథలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.