SIP మ్యాజిక్.. రూ.10 వేల పొదుపుతో ఒకేసారి చేతికి రూ.40 లక్షలు.. టాప్-3 స్కీమ్స్ ఇవే!

Wait 5 sec.

Investment: మీరు దీర్ఘకాలంలో స్థిరమైన రాబడి అందించే మ్యూచువల్ ఫండ్స్‌ కోసం చూస్తుంటే మీరు (Nippon India Mutual Fund) అందించిన టాప్-3 స్కీమ్స పరిశీలించవచ్చు. క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు ఈ 3 ఫండ్స్‌లో గడిచిన 10 సంవత్సరాల కాలంలో మార్కెట్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇందులో పెట్టుబడులను అంతరాయం లేకుండా కొనసాగించినట్లయితే అందించిన రిటర్న్స్ చూసి మీరు ఆశ్చర్యపోకమానరు. నిప్పాన్ ఇండియా నుంచి వచ్చిన 3 గత పదేళ్లలో సగటున 20 శాతం వార్షిక రాబడి అందించాయి. లాంగ్ టర్మ్‌లో భారీ రిటర్న్స్ ఇందించాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా నెల నెలా రూ.10 వేల పెట్టుబడి పెట్టిన వారికి గత 10 ఏళ్లలోనే ఏకంగా రూ.40 లక్షల వరకు అందించాయి. గత పదేళ్లలో బెస్ట్ పర్ఫార్మెన్స్ నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జాబితాలో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా పవర్ ఇన్‌ఫ్రా ఫండ్ ఉన్నాయి. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ () గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే సగటున 22.53 శాతం వార్షిక రాబడి అందించింది. ఇందులో నెలకు రూ.10 వేలు పొదుపు చేసినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ.39.75 లక్షలు అవుతుంది.నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్నిప్పాన్ ఏఎంసీ నుంచి వచ్చిన మిడ్ క్యాప్ ఫండ్ () గత పది సంవత్సరాల కాలంలో సగటున సిప్ రాబటి 21.05 శాతంగా అందించింది. అంటే ఇందులో నెలకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెడుతూ వచ్చిన వారికి పదేళ్లలో రూ.36.68 లక్షలు అందించింది.నిప్పాన్ ఇండియా పవర్ ఇన్‌ఫ్రా ఫండ్నిప్పాన్ పవర్ అండ్ ఇన్‌ఫ్రా ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గడిచిన 10 సంవత్సరాల కాలంలో సిప్ రాబడి వార్షికంగా చూసుకుంటే 20.93 శాతంగా ఉంది. ఇందులో రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు రూ.36.34 లక్షల వరకు అందుతాయి.Disclaimer: ఈ కథనం ఇన్వెస్టర్లకు సమాచారం ఇచ్చేందుకు మాత్రమే. ఏ పెట్టుబడులను ప్రోత్సహించడానికి మాత్రం కాదు. మ్యూచువల్ ఫండ్ లోనూ హైరిస్క్ ఉంటుంది. గతంలో వచ్చిన రాబడులు ముందు ముందు వస్తాయనే గ్యారెంటీ ఉండదు. అందుకే నిపుణుల సలహా తీసుకుని సరైన ఫండ్ ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం