ఈ స్కీమ్‌తో 6 నెలల్లోనే డబ్బు డబుల్- 2026లో కాసులు కురిపించిన టాప్- 10 మ్యూచువల్ ఫండ్స్ ఇవే!

Wait 5 sec.

: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు 2026 ఏడాది మొదటి ఆరు నెలలు అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టాయి. మార్కెట్లో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ దాదాపుగా 10 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చూస్తే సగటున 25 శాతానికి మించి రిటర్న్స్ అందించాయి. ఒక ఫండ్ ఏకంగా ఇన్వెస్టర్ల పెట్టుబడిని 6 నెలల కాలంలోనే రెట్టింపు చేయడం విశేషం. ఈటీ మ్యూచువల్ ఫండ్స్ ఈ రిపోర్ట్ విడుదల చేయగా ఇందులో టాప్ ఫండ్స్ ఏవి.. ఎంతెంత రిటర్న్స్ అందించాయి.. ఇంకా నష్టాలు మిగిల్చిన పథకాలు ఏం ఉన్నాయనేది తెలుసుకుందాం. ఈ కాలంలో మొత్తం 590 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉండగా వీటి నుంచి టాప్ స్కీమ్స్ ఏవో చెప్పింది.గత కొంత కాలంగా ఇంటర్నేషనల్ ఫండ్స్ అద్భుతంగా రాణిస్తుండగా ఇప్పుడు కూడా 6 నెలల కాలంలో ఇంటర్నేషనల్ ఫండ్ టాప్‌లో నిలిచింది. మళ్లీ మామూలుగా కాదు అద్భుత స్థాయిలో రాబడి అందించింది. అదే . ఇది రికార్డు స్థాయిలో 6 నెలల్లోనే ఏకంగా 102.23 శాతం రిటర్న్స్ ఇవ్వగా డబ్బును డబుల్ చేసింది. అంటే రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి 6 నెలల్లోనే రూ. 2 లక్షలకుపైగా వచ్చాయి. 5 లక్షలు పెడితే 10 లక్షలు వచ్చాయన్నమాట. ఇందులో రెండో స్థానంలో కూడా ఇంటర్నేషనల్ ఫండ్ ఉండగా ఇది మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 ఎఫ్ఓఎఫ్ స్కీమ్. ఇది సగటున 40.34 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అంటే 6 నెలల్లోనే లక్ష పెట్టుబడిపై రూ. 40 వేలకుపైగా లాభం వచ్చింది.ఎమర్జింగ్ మార్కెట్స్ థీమ్స్ హెచ్ఎస్‌బీసీ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్, ఎడెల్‌వీస్ ఎమర్జింగ్ మార్కెట్స్ అపార్చునిటీస్ ఈక్విటీ ఆఫ్‌షోర్ ఫండ్, కోటక్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్ని ఎఫ్ఓఎఫ్, పీజీఐఎం ఇండియా ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఎఫ్ఓఎఫ్ వరుసగా 35.32 శాతం, 34.59 శాతం, 34.53 శాతం, 34.01 శాతం రిటర్న్స్ అందించాయి.మిగతా వాటిల్లో మిరే అసెట్ గ్లోబల్ x ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు అంటే 6 నెలల్లో 32.29 శాతం రిటర్న్స్ అందించింది. ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్ 29.21 శాతం రిటర్న్స్‌తో తర్వాతి స్థానంలో నిలిచింది. మిగతా 2 ఫండ్స్ చూస్తే మిరే అసెట్ గ్లోబల్ ఎలక్ట్రిక్ అండ్ అటానమస్ వెహికిల్స్ ఈక్విటీ పాసివ్ ఎఫ్ఓఎఫ్, డీఎస్పీ గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్ని ఎఫ్ఓఎఫ్ వరుసగా 28.43 శాతం, 25.67 శాతం రిటర్న్స్‌తో ఉన్నాయి.భారీగా నష్టపోయిన సెక్టార్ ఏది?ఈ 6 నెలల కాలంలో చూస్తే అత్యధికంగా నష్టపోయింది టెక్నాలజీ (ఐటీ) ఫండ్స్. హెచ్‌డీఎఫ్‌సీ టెక్నాలజీ ఫండ్ దాదాపు 22.83 శాతం నష్టపోగా రూ. లక్షపై రూ. 23 వేల వరకు నష్టం వచ్చిందన్నమాట. ఇదే సమయంలో ఎస్బీఐ టెక్నాలజీ అపార్చునిటీస్ ఫండ్ 21.88 శాతం నష్టపోయింది. ఇవే అత్యంత వరెస్ట్ పెర్ఫామర్లుగా నిలిచాయి. పాపులర్ ఫండ్లలో ఒకటైన పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6.02 శాతం నెగెటివ్ రిటర్న్స్ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గమనిక: ఇలా థిమాటిక్ లేదా ఇంటర్నేషనల్ ఫండ్స్ భారీ లాభాలు ఇచ్చాయి కదా అని వెంటనే అందులోకి మారొద్దు. ఆర్థిక నిపుణుల ప్రకారం మీ పోర్ట్‌ఫోలియోను వీలైనంత డైవర్సిఫైడ్‌గా ఉంచుకోవడం, లార్జ్ క్యాప్ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌ను నమ్ముకోవడమే దీర్ఘకాలంలో మంచిది. ఇంకా పైన ఇచ్చింది సమాచారమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.