దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పుణేకు చెందిన సమర్దిస్తూ ఓ డెంటిస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్ట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఆమెపై ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అండ్ సర్జన్స్ అసోసియేషన్ (AIDSA) చర్యలు చేపట్టింది. మధ్యప్రదేశ్ కోశాధికారి పదవి నుంచి తొలగించడమే కాదు.. ఆమెపై ఐదేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. వివరాల్లోకి వెళ్తే.. సత్నాకు చెందిన డెంటిస్ట్ డాక్టర్ ముస్కాన్ సోని.. కేసులో నిందితురాలు, అతడికి కాబోయే భార్య సియా గోయల్‌ను సమర్థించేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేశారు.‘నాకు మగాళ్లంటే అసహ్యం’ అనే హ్యష్ ట్యాగ్‌‌‌తో ఆమె పెట్టిన పోస్ట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. కే బయటపడుతున్న సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. అయితే, ఈ వ్యవహారం తీవ్రత దృష్ట్యా ఆమె క్షమాపణలు సరిపోవని భావించిన అసోసియేషన్.. చర్యలకు ఉపక్రమించింది. డాక్టర్ సోనీ ప్రస్తుతం సత్నా‌లో పోస్టింగ్‌ మీద ఉన్నారు. ఆమెను ఐదేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ AIDSA నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ దివాకర్ మూదౌతియా జూన్ 29న ఉత్తర్వులు జారీచేశారు. ‘‘డాక్టర్ సోనీ క్రమశిక్షణా రాహిత్య చర్యలకు పాల్పడ్డారని, మృతుని గురించి అత్యంత అనుచితమైన, అభ్యంతరకరమైన, అగౌరవకరమైన వ్యాఖ్యలు" చేశారని, ఇవి తమ అసోసియేషన్ ప్రవర్తనా నియమావళి, నైతిక విలువలను ఉల్లంఘించాయి’’ అని అన్నారు.‘‘హింసను సమర్థించే లేదా కీర్తించే విధంగా లేదా మృతుని పట్ల గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేయడానికి ఏ కార్యవర్గ సభ్యుడిని గానీ, సభ్యుడిని గానీ సంఘం అనుమతించదు’’ అని డాక్టర్ మూదౌతియా స్పష్టం చేశారు. ఉత్తర్వు ప్రకారం డాక్టర్ సోనిని ఎయిడ్సా మధ్యప్రదేశ్ కోశాధికారి పదవి నుంచి తొలగించి, తక్షణమే అమల్లోకి వచ్చేలా ఐదేళ్లపాటు సభ్యత్వం నుంచి నిషేధించారు.సస్పెన్షన్ కాలంలో ఆమె ఏ అధికారిక హోదాలోనూ సంఘానికి ప్రాతినిధ్యం వహించడానికి, సమావేశాలు, సదస్సులు లేదా సంస్థాగత కార్యకలాపాలలో పాల్గొనడానికి, లేదా తన పదవి లేదా సభ్యత్వానికి సంబంధించిన ఏవైనా హక్కులు లేదా బాధ్యతలను వినియోగించుకోవడానికి అనుమతి ఉండదు.సంస్థ క్రమశిక్షణ, గౌరవం, సమగ్రతను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ మూదౌతియా తెలిపారు. ‘‘నైతిక ప్రమాణాలను దెబ్బతీసే లేదా వృత్తికి అపఖ్యాతిని తెచ్చే ప్రవర్తనను సంఘం ఏమాత్రం సహించదు... ప్రతి సభ్యుడు వృత్తిపరంగా, సోషల్ మీడియాలో కూడా బాధ్యతాయుతమైన ప్రవర్తనను పాటించాలని ఆశిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.