అప్పు తిరిగివ్వమన్నాడని పిల్లనిచ్చిన మామనే చంపిన అల్లుడు

Wait 5 sec.

లోకం తీరు రోజురోజుకూ మరీ దారుణంగా మారిపోతుంది. డబ్బు, పగ తలకుపడితే కంటికి బంధువులు కూడా కనిపించని రోజులు ఇవి. అవసరమైతే చచ్చేందుకైనా.. చంపేందుకైనా సిద్ధమవుతున్నారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు పిల్లనిచ్చిన మామనే కడతేర్చాడు ఓ అల్లుడు. ఈ ఘటన జిల్లా తాడిపత్రిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..కడప జిల్లా కొండాపురం మండలం ఏటూరుకు చెందిన శంకర్ నారాయణరెడ్డి (70)కి ఇద్దరు భార్యలు. చిన్న భార్య అరుణ రెండో కుమార్తె నవీన సొంతూరిలోనే సత్యనారాయణ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. వీళ్లు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గన్నెవారిపల్లి కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే, శంకర్ నారాయణరెడ్డి తన భార్యతో కలిసి చిన్న కూతురు ఇంట్లోనే ఉంటున్నారు. READ ALSO అల్లుడు సత్యనారాయణకి ఏదో అవసరం ఉందంటే మామ శంకర్ నారాయణరెడ్డి రూ. 10 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇటీవల అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని శంకర్ నారాయణరెడ్డి అల్లుడిని పలుమార్లు అడిగాడు. ఈ క్రమంలోనే సత్యనారాయణ, నవీన మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. దాంతో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోగా.. తన కూతురిని కూడా వేధిస్తున్నాడనే కారణంతో శంకర్ నారాయణ రెడ్డి తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అల్లుడిని రిమాండ్‌కు తరలించారు. రిమాండ్ నుంచి విడుదలై వచ్చిన అల్లుడు సత్యనారాయణ దీన్ని మనస్సులో పెట్టుకుని మామపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. దాంతో పథకం ప్రకారం గత నెల 26వ తేదీ రాత్రి తన వద్ద పనిచేసే గోవర్ధన్ అనే వ్యక్తితో కలిసి మద్యం తాగి శంకర్ నారాయణ రెడ్డిపై దాడి చేశారు. తీవ్రగాయాలైన శంకర్ నారాయణ రెడ్డి చనిపోయాడు. గన్నెవారిపల్లి కాలనీలోని మరో ఇంట్లో ఉంటున్న పెద్ద కుమార్తె నవిత తన తండ్రి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేసి అల్లుడు సత్యనారాయణ పథకం ప్రకారమే గోవర్ధన్‌తో కలిసి హత్య చేశాడని నిర్థారించి అరెస్టు చేశారు.