రొట్టెల పండగకి వెళ్లి తిరిగొచ్చేసరికి ఇంట్లో చోరీ.. ఊహించని రీతిలో పోయింది మొత్తం చేతికి..!

Wait 5 sec.

నెల్లూరు రొట్టెల పండగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి రొట్టెలు తీసుకుంటే మనస్సులో ఏం కోరుకున్నా నెరవేరుతుందని అందరూ చెబుతుంటారు. కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతస్థులు కూడా నెల్లూరు రొట్టెల పండగకు వెళ్తుంటారు. కృష్ణా జిల్లాలోని ఓ కుటుంబం కూడా నెల్లూరు రొట్టెల పండగకి వెళ్లింది. అయితే ఇంటికి తిరిగొచ్చేసరికి ఊహించని షాక్ ఎదురైంది, దాన్ని నుంచి తేరుకునేలోపే గుడ్ న్యూస్ కూడా వచ్చింది.కృష్ణా జిల్లా పాయకాపురం శాంతినగర్‌లో ఉంటున్న షేక్ నగీనా, మక్బూల్ బాషా దంపతులు ఉంటున్నారు. బాషా ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 26వ తేదీన వీళ్ల కుటుంబం నెల్లూరు రొట్టెల పండగకు వెళ్లింది. టూర్ ముగించుకుని మంగళవారం సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఇంటి తాళం పగలగొట్టి, తలుపులు తెరిచి ఉన్నాయి. దాంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.READ ALSO ఇంట్లోకి వెళ్లగా వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువా తాళాలు పగలగొట్టి ఉండటంతోపాటు అందులో ఉన్న 102.54 గ్రాముల బంగారం, 178.85 గ్రాముల వెండి వస్తువులు, రూ. 35,940 నగదు మాయమైనట్లు గుర్తించారు. దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.పోలీసులు అడగడంతో బాధితులు తమ బంగారానికి సంబంధించిన బిల్లులు కూడా చూపెట్టారు. ఆ బిల్లులు చూసిన వెంటనే అదే ప్రాంతంలో ఉండే రమేశ్‌కు సోమవారం ఓ బ్యాగులో దొరికిన బంగారం, వెండి వస్తువులు, నగదు వీళ్లవేనని పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే చెక్ చేసి, అవి బాధితులు మక్బూల్ బాషా కుటుంబానివేనని పోలీసులు నిర్థారించారు. దొంగతనం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బాధితులు తెలిపిన వివరాలు, అందించిన బిల్లులను పరిశీలించి కోర్టు ద్వారా ఈ వస్తువులను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. నెల్లూరు రొట్టెల పండగకి వెళ్లొచ్చిన వెంటనే ఇంట్లో బంగారం చోరీకి గురవ్వడం.. మళ్లీ వెంటనే ఓ బ్యాగులో దొరకడం చూసి బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.