రాయలసీమకు మహర్దశ.. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. రేపే శంకుస్థాపన..

Wait 5 sec.

రానుంది. ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్స్‌ చిత్తూరు జిల్లాలో పెట్టుబడులు పెడుతోంది. సత్యవేడు మండలం మాదనపాళెంలో హీరో మోటార్స్ గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణానికి జులై 1వ తేదీన సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. హీరో మోటార్స్‌ జీపీసీ ద్వారా విడిభాగాలు తయారు చేస్తారు.750 కోట్ల రూపాయల పెట్టుబడితో హీరో మోటార్స్ జీపీసీ-2.0ను నిర్మించనుంది. ఈ నిర్మాణం పూర్తై.. అందుబాటులోకి వస్తే సుమారుగా నాలుగు వేల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. మరోవైపు హీరో మోటార్స్ సంస్థ శ్రీసిటీ సమీపంలోని తన ప్లాంట్ ద్వారా ఇప్పటికే ఏటా 1.5 మిలియన్ల వాహనాలు ఉత్పత్తి చేస్తోంది. అయితే దేశ, విదేశాల్లోని మోటార్‌ సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, స్కూటర్ల విడిభాగాలను తయారు చేసేందుకు ఈ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమంలో హీరో మోటార్స్ సంస్థ మార్గదర్శిగా ఉంది. ఈ నేపథ్యంలో పలువురికి స్కాలర్‌షిప్‌లు అందించేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌ ద్వారా బ్రిజ్‌ మోహన్‌లాల్‌ ముంజల్‌ పేరు మీద.. హీరోస్‌ ఆఫ్‌ టుమారో పేరుతో ఈ స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. ఈ కార్యక్రమం కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బుధవారం ప్రారంభం కానుంది. అలాగే పోలీసుల కోసం తయారు చేసిన ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వాహనాలను చంద్రబాబు రేపు అందజేయనున్నారు. మరోవైపు మాదనపాళెం పరిధిలో హీరో మోటార్స్ కంపెనీకి 2017లోనే ఏపీఐఐసీ ద్వారా భూమి కేటాయించారు చంద్రబాబు. 2018 మార్చిలో రూ.1600 కోట్ల పెట్టుబడితో హీరో మోటార్స్‌ ప్రపంచ స్థాయి తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. తాజాగా హీరో మోటార్స్‌ విడిభాగాల తయారీ కేంద్రానికి చంద్రబాబే శంకుస్థాపన చేస్తూ ఉండటం విశేషం. మరోవైపు రాకూడా ఇటీవల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.