సాధారణంగా ప్లేట్ పూరీ ఎంత ఉండొచ్చని అనుకుంటున్నారు.. మహా అయితే రూ.40ల దాకా ఉండొచ్చు. గ్యాస్ బండ ధరలు పెరిగిన ప్రభావం కూడా పడిందే అనుకోండి.. మరో పది రూపాయలు పెరుగుతుంది.. అంటే సుమారుగా రూ.50. ఇక ఫేమస్ హోటల్స్ అయితే.. ఏ వందో, రూ.200 వరకో ఉండొచ్చు. అయితే పూరీ ప్లేటు రూ.2000 అనే సంగతి మీరెప్పుడైనా విన్నారా.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోనూ ఈ రేంజు ధరలు ఉండవని అనుకుంటున్నారు కదూ.. ఈ విచిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. .. మంగళవారం రోజున వాల్మీకి నగర్‌ వార్డులో పర్యటించారు. వార్డులోని ప్రజల యోగక్షేమాలు అడుగుతూ వెళ్తున్న ఆయనకు.. ఓ హోటల్ కనిపించింది.దీంతో హోటల్‌లోకి వెళ్లిన పార్థసారథి.. అక్కడున్న కస్టమర్ల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇంత దూరం ఎలాగూ వచ్చాం కదా అని.. తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కూడా ప్రదర్శించారు ఎమ్మెల్యే. స్వయంగా పూరీలు చేశారు. ఎమ్మెల్యే పూరీలు చేయడం ఒక ఎత్తు అయితే.. ఒక కార్యకర్త ప్లేటు పూరీని రూ.2000 పెట్టి కొనుగోలు చేయడం మరో విశేషం. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఇలాంటి విషయాలతో ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజల కోసం మీ పార్థసారథి పేరుతో ఆదోని నియోజకవర్గంలో తిరుగుతున్న ఆయన.. ఇలా వినూత్న కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల అరుణ జ్యోతి నగర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే.. అక్కడ ఉన్న ఓ హోటల్ సందర్శించారు. హోటల్‌లో మహిళ దోసెలు వేయడాన్ని గమనించిన ఆయన.. ఆవిడతో కాసేపు మాట్లాడి, ఆ తర్వాత గరిట పట్టి ఓ దోశ వేశారు. అక్కడితో ఊరుకోకుండా ఎమ్మెల్యే గారి దోసెకు వేలంపాట కూడా నిర్వహించారు. ఈ వేలంపాటలో కొనుగోలు చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ మేక పాలు పిండుకుని ఎమ్మెల్యే తాగిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే.. తన పనులతో ప్రజలను, మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి.