ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా చేసిన సిరీస్ ‘’. ఈ సిరీస్‌లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, సునీల్, నరేష్ అగస్త్య, రాజా చెంబోలు, సుధాకర్ కొమాకుల వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ అంటూ ‘ఇసకపట్నం’పై అంచనాలు పెంచేశారు. ప్రమోషన్స్ టైంలోనూ ఐశ్వర్య రాజేష్ చెప్పిన విషయాలు సిరీస్ మీద ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. మరి ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.కథఇసకపట్నం అనే సిటీని నాయుడు (సముద్రఖని) తన కంట్రోల్‌లో పెట్టుకుంటాడు. చిన్నారావు (రాజీవ్ కనకాల)ని చంపి నాయకుడిగా ఎదుగుతాడు నాయుడు. బర్మా నుంచి వలస కూలీగా వచ్చిన పోతన (జ్వాలా కోటి) ఇక్కడ అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తాడు. కానీ చిన్నా రావు దగ్గర నుంచి నాయుడు వరకు వారికి నీడలానే బతుకుతుంటాడు. ఇసకపట్నంలో అధికారం తనదే అవ్వాలని ప్రతాప్ వర్మ (రవి వర్మ) కూడా ప్రయత్నిస్తుంటాడు. ఇక నాయుడు కూతురు భారతి (ఐశ్వర్య రాజేష్) మాత్రం తండ్రి అక్రమాలు, అన్యాయాల్ని ఎదురిస్తూ ఎన్జీవో కోసం పని చేస్తుంటుంది. జనాలకు మంచి చేయాలని, కార్పోరేటర్‌గా ఎదగాలని ఆటో డ్రైవర్‌ పెద్దన్న (నరేష్ అగస్త్య) ప్రయత్నిస్తుంటాడు. గ్యాస్ పైప్ లైన్ ప్రమాదంతో అంతా ఒక్కసారిగా మారిపోతుంది. నాయుడు తన చుట్టూ ఏదో జరుగుతుందని గ్రహిస్తాడు. ఇక ప్రతాప్ వర్మకు చెక్ పెట్టాలని తన కూతురు భారతినిచ్చి పెళ్లి చేయాలని నాయుడు నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది? అసలు ఆ ప్రమాదానికి కారణం ఎవరు? ఈ కథలో నాయుడు కుడి భుజం కోటయ్య (బెనర్జీ), అతని కొడుకు శేఖర్ (రాజా చెంబోలు) పాత్ర ఏంటి? నాయుడు వద్ద పని చేసే సూరి (సుధాకర్ కొమాకుల), భారతి ప్రేమ కథ ఎటు దారి తీస్తుంది? ఈ ప్రయాణంలో సీఐ వర్మ (సునీల్), తంగవేల్ (మైమ్ గోపీ) ప్రాముఖ్యత ఏంటి? అన్నది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.ఒక సిటీ.. అందరినీ గుప్పిట్లో పెట్టుకుని.. ఎదురంటూ లేకుండా ఏలే ఓ వ్యక్తి.. ఆ వ్యక్తిని ఏసేయాలని కొంత మంది.. ఆధిపత్యం కోసం జరిగే పోరు.. ఇదంతా ఎన్నో సినిమాల్లో, సిరీస్‌లో చూశాం. అయితే ఈ ‘ఇసకపట్నం’లోనూ అలాంటి కథే సాగుతుంది. కానీ ఈ కథలో భారతీ పాత్ర చాలా డిఫరెంట్‌గా కొత్తగా కనిపిస్తుంది. ఎపిసోడ్స్ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ పాత్రలోని మార్పు ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. నెక్ట్స్ ఎలాంటి పావుల్ని కదుపుతారు.. ఎలాంటి మలుపు తిరుగుతుంది అని ఎదురుచూసేలా కథ సాగుతుంది.గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గానే ఇంత వరకు అందరికీ తెలుసు. కానీ దర్శకుడిగానూ గ్యారీ బీహెచ్ ఈ ‘ఇసకపట్నం’తో మెప్పించాడనే చెప్పుకోవచ్చు. ఇందులోని పాత్రలు, అవి ప్రవర్తించే తీరు.. ఎపిసోడ్.. ఎపిసోడ్‌కి మారుతుంటుంది. ఈ సిరీస్‌లోని ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఏ పాత్రతో ఎలాంటి మలుపు వస్తుంది అన్నది చెప్పలేం. అయితే నిదానంగా, బోరింగ్‌గా సాగుతూ కొన్ని సార్లు ఇబ్బంది కలిగిస్తుంది. కానీ ఐశ్వర్య రాజేష్ పాత్ర వచ్చిన ప్రతీ సారి ఏదో ఒక కొత్త ఘటన జరుగుతూ ఉంటుంది. అలా సిరీస్‌ మొత్తం ఐశ్వర్య రాజేష్ చుట్టూ తిరుగుతుంటుంది.ఎవరిది నెగెటివ్ పాత్ర.. ఎవరిది పాజిటివ్ పాత్ర అన్నది చివరి వరకు చెప్పడం కష్టమే. ఎవరి లక్ష్యం ఏంటి? అన్నది చివరి వరకు తేలదు. కానీ ప్రతీ సీన్ ఎక్కడో చోట చూసినట్టేగా అనిపిస్తుంది. కొత్తదనం లేకపోవడం కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, పరంపర సిరీస్ ఇలా ప్రాజెక్టుల ఛాయలు కనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగుంటాయి. మేకింగ్ బాగుంటుంది. పాటల కంటే ఆర్ఆర్ మెరుగ్గా అనిపిస్తుంది. సీన్లకు తగ్గట్టుగా బీజీఎం సాగుతుంది. కొన్ని సీన్లు అవసరమా? అన్న ఫీలింగ్ కలిగే అవకాశం ఉంటుంది. ఒక మనిషి బలాన్ని లాక్కోవాలంటే చంపాల్సిన పని లేదు.. చచ్చేంత పని చేస్తే చాలు.. అని ఇలా కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ బాగుంటాయి.‘ఇసకపట్నం’ సిరీస్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐశ్వర్య రాజేష్ గురించే. ఆమె పాత్రలోని డైమెన్షన్, యాక్టింగ్ తీరు అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఓ డిఫరెంట్ పాత్రను ఐశ్వర్య రాజేష్ గొప్పగా పోషించిందని చెప్పుకోవచ్చు. ఐశ్వర్య రాజేష్ పాత్రే ఈ సిరీస్‌కి సోల్. ఆమె యాక్టింగే బలం. ఆ తర్వాత సముద్రఖని నాయుడు పాత్ర గుర్తుంటుంది. అయితే సముద్రఖని విలనిజం కొత్తగా ఏమీ అనిపించదు. సునీల్‌ పాత్ర, సుధాకర్ యాక్టింగ్, రాజా చెంబోలు కారెక్టర్ ఇలా అన్నీ బాగుంటాయి. కోటయ్యగా బెనర్జీ, తంగవేలుగా మైమ్ గోపీ, పోతన పాత్రలో జ్వాలా కోటి, పెద్దన్నగా నరేష్ అగస్త్య ఇలా ప్రతీ కారెక్టర్ బాగానే ఉంటుంది. మిగిలిన అన్ని పాత్రలు కూడా పరిధి మేరకు మెప్పిస్తాయి.ఓవరాల్‌గా ‘ఇసకపట్నం’ సిరీస్ కాస్త నిదానంగా, బోరింగ్‌గా అనిపించినా.. చివరకు ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొన్ని సీన్లు, కొన్ని డైలాగ్స్ మినహాయిస్తే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలానే ఉంటుంది.