క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే డబ్బు ఆదా- లేదంటే డబుల్ లాస్!

Wait 5 sec.

: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కిరాణా సామాన్ల దగ్గరి నుంచి మొదలుకొని ఫ్లైట్ టికెట్స్ వరకు కూడా అన్నింటికీ ఈ కార్డుల్నే వాడుతున్నారు. ఈ క్రమంలోనే నెలనెలా ఇంటి అద్దెను (రెంట్ పేమెంట్స్) కూడా చాలా మంది క్రెడిట్ కార్డులతోనే కట్టేస్తున్నారు. క్రెడ్, పేటీఎం, నోబ్రోకర్ వంటి యాప్స్ ఇందుకు వేదికగా నిలుస్తున్నాయి. చేతిలో డబ్బు లేనప్పుడు 45 రోజుల క్రెడిట్ పీరియడ్ దొరుకుతుంది కదా అని సంబరపడే లోపే బ్యాంకులు పెద్ద షాక్ ఇస్తున్నాయి. అసలు క్రెడిట్ కార్డుతో రెంట్ కడితే డబ్బు ఎలా ఆదా అవుతుంది.. ఏ చిన్న తప్పులు చేస్తే డబుల్ పెనాల్టీ పడుతుందో చూద్దాం. క్రెడిట్ కార్డ్ రెంట్ పేమెంట్స్‌తో లాభాలులిక్విడిటీ మేనేజ్మెంట్- జీతం రావడం ఆలస్యమైనా లేదా చేతిలో అస్సలు డబ్బు లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకటో తేదీన ఓనర్‌కు రెంట్ వెళ్తుంది. మీకు బ్యాంక్ నుంచి దాదాపు 45- 50 రోజుల వరకు వడ్డీ లేని సమయం దొరుకుతుంది. రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్- కొన్ని ప్రీమియం క్రెడిట్ కార్డులపై రెంట్ పేమెంట్స్ చేస్తే కూడా రివార్డ్ పాయింట్లు, ఎయిర్ మైల్స్ వస్తుంటాయి. వీటిని షాపింగ్ లేదా ఫ్లైట్ టికెట్లకు వాడుకోవచ్చు.యాన్యువల్ ఫీజు మాఫీ- చాలా కార్డుల్లో ఏడాదికి రూ. 2 లక్షలు లేదా 3 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రుసుము కూడా మాఫీ అవుతుంటుంది. ప్రతి నెలా రెంట్ ఈ కార్డుతో చేస్తే ఈ మైల్ స్టోన్ ఈజీగా రీచ్ అవ్వొచ్చు. జేబుకు చిల్లుపొడిచే నష్టాలుఇక్కడే క్రెడిట్ కార్డులు వాడే వారు కొన్ని నష్టాల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. హిడెన్ ఛార్జీల్ని గమనించాలి. కన్వీనియెన్స్ ఫీజు- మీరు రెంట్ పే చేసేందుకు వాడే యాప్స్ ప్రతి ట్రాన్సాక్షన్‌పై 1 నుంచి 2 శాతం వరకు రుసుముల్ని వసూలు చేస్తుంటాయి. ఇది గమనించాలి. బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీ+జీఎస్టీ- దాదాపుగా అన్ని ప్రముఖ బ్యాంకులు క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ కడితే అదనంగా రూ. 99 నుంచి ఒక శాతం వరకు రెంట్ ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. దీనిపై మళ్లీ జీఎస్టీ అదనం.ఇదే సమయంలో ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు బిల్లును నిర్ణీత గడువులోగా పూర్తిగా కట్టకపోతే- కేవలం మొత్తం బకాయిలో మినిమం డ్యూ చెల్లిస్తే మిగిలిన బకాయిపై బ్యాంకులు ఏకంగా 36 నుంచి 42 శాతం వరకు వార్షిక వడ్డీ వసూలు చేస్తుంటాయి. ఇది మీ రెంట్ ఖర్చును డబుల్ చేసే ప్రమాదం ఉంటుంది.అందుకే ఈ పెనాల్టీ, అదనపు భారం తగ్గించుకోవాలంటే నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. పైన లాభాలు కూడా చూసి ఏది బెస్ట్ అయితే అది ఎంచుకోవచ్చు. ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు సెలక్ట్ చేసుకోవచ్చు.