పాకిస్థాన్‌పై అప్ఘనిస్థాన్ బాంబుల వర్షం.. ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడి!

Wait 5 sec.

పాకిస్థాన్ - అప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరాచీలో దాడి జరిగిన వెంటనే పాక్, అప్ఘన్‌పై వైమానిక దాడులు చేసింది. అందుకు ప్రతీకారం తీర్చుకుంటూ అప్ఘనిస్థాన్ కూడా పాకిస్థాన్‌పై బాంబు వర్షం కురిపించింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ (ఐసిస్ - కే) ఉగ్రవాద సంస్థ స్థావరాలని లక్ష్యంగా చేసుకుంటూ పాక్ భూభాగంలో డ్రోన్ దాడులు నిర్వహించినట్లు తాలబిన్ ప్రభుత్వం పేర్కొంది. తాలిబన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బలోచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లలో ఈ దాడులు జరిగాయి. అక్కడ ఉండే స్థావరాల నుంచే అప్ఘనిస్థాన్‌లో పౌరులపై దాడులు, విధ్వంసకర చర్యలకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొంది. అందుకే వాటిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు నిర్వహించినట్లు తాలిబన్లు తెలిపారు. ఈ డ్రోన్ దాడుల్లో పలువురు ఐసిస్ కే సభ్యులు హతమైనట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. సామాన్య పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. READ MORE అప్ఘనిస్థాన్ డ్రోన్ దాడికి రెండు రోజుల ముందు ఆదివారం రోజున పాకిస్థాన్ అప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 28 మంది పౌరులు గాయపడగా, 49 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ భద్రత బలగాలు మాత్రం మృతులంతా ఉగ్రవాదులే అని చెబుతున్నాయి. మరోవైపు అప్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ ప్రకారం పాకిస్థాన్ దాడుల్లో 38 మంది పౌరులు మృతి చెందగా.. మహిళలు, చిన్నారులు సహా 163 మంది గాయపడినట్లు తెలుస్తోంది. READ MORE ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పాక్ - అప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఒకళ్లపై ఒకళ్లు దాడులు చేసుకుంటూ సామాన్య పౌరులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. అప్ఘనిస్థాన్‌ భూభాగంపై జరిగిన వైమానిక దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అప్ఘనిస్థాన్ సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడగా, ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ముప్పుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్ఘనిస్థాన్‌కు భారత్ ఎప్పుడూ అండగా నిలుస్తుందంటూ ప్రకటించింది.