ఏపీలో పొరపాటున కూడా ఈ ఇంజెక్షన్ వాడొద్దు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. రాష్ట్రంలో ‘బుపివాకైన్‌’ ఇంజెక్షన్ వాడొద్దని ఏపీఎంఎస్‌ఐడీసీ డ్రగ్స్‌ విభాగం ఆదేశింది. బుపివాకైన్‌ మత్తు ఇంజెక్షన్‌ను థెమిస్‌ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.. దీనిని వెన్నెముకకు ఇస్తారు. ఐఎస్‌ఏ (ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అనస్థీషియాలజిస్ట్స్‌), ఏపీఎస్‌ఏ (అనస్థీషియా పేషెంట్‌ సేఫ్టీ అసోసియేషన్‌) ఫిర్యాదులు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ ఇంజెక్షన్ వాడొద్దని అన్ని సెంట్రల్‌ డ్రగ్‌ సోర్ట్స్‌ అధికారుల్ని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా ఈ ఇంజెక్షన్‌ల నిల్వలు ఉంటే పక్కన పెట్టాలని సూచించారు. ఆస్పత్రులు, మెడికల్ డిపార్ట్‌మెంట్‌లకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ డ్రగ్స్‌ సరఫరా నిలిపివేయాలని ఏపీఎంఎస్‌ఐడీసీ డ్రగ్స్‌ విభాగం ఆదేశించింది. ఈ బుపివాకైన్‌ ఇంజెక్షన్‌ వినియోగించవద్దంటూ బోధనాసుపత్రుల్ని డీఎంఈ కార్యాలయం అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా డాక్టర్లు ఈ బుపివాకైన్‌ వాడకం నిలిపివేయాలని ఐఎస్‌ఏ అప్రమత్తం చేసింది.. ఎమర్జెన్సీగా మెసేజ్ పంపింది. ఈ బుపివాకైన్ ఇంజెక్షన్ దుష్ప్రభావాలు చూసినట్లు తేలడంతో రోగుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ అదనపు సీఈవో నియామకంఏపీ ప్రభుత్వం డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ అదనపు సీఈవోగా కె భవానీ శంకర్‌ను నియమించింది. భవానీ శంకర్ రాష్ట్ర ఆడిట్‌ శాఖలో డీడీగా ఉన్నారు.. ప్రస్తుతం ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఫైనాన్స్‌ కంట్రోలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన్ను డిప్యుటేషన్‌పై ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌లో అదనపు సీఈవో పోస్టు ఖాళీగా ఉండడంతో నియమించింది.ఈ మేరకు భవానీ శంకర్ నియామానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలో జీఎస్టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌మంగళగిరిలో జీఎస్టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి ఇండస్ట్రియల్‌ పార్క్‌లోని పీవీస్‌ ల్యాండ్‌ మార్క్‌ మొదటి అంతస్తులో జీస్టాట్‌ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌) బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని జీస్టాట్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ వీఎస్‌కే రాయలు తెలిపారు. జీస్టాట్‌ బెంచ్ ఇప్పటివరకు విజయవాడ లబ్బీపేటలో తాత్కాలికంగా కొనసాగింది.. జులై 1న మంగళగిరిలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. జీస్టాట్‌ ప్రభుత్వం, జీఎస్టీ చెల్లింపుదారుల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. ఈ మేరకు కార్యాలయం అడ్రస్ మార్పు విషయాన్ని గుర్తించాలని కోరారు.