రైతు భరోసా నిధుల విడుదల.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా.. పడకపోతే ఈ పని చేయండి!

Wait 5 sec.

తెలంగాణలో అన్నదాతల పంట పెట్టుబడి సాయం కింద చేశారు. తొలుత 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు జమ చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్న వారి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమందికి రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవడం తెలియదు. మరికొందరికి అసలు పడక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే రైతు భరోసా డబ్బులు పడని వారు.. అందుకు గల కారణాలు తెలుసుకుని.. సంబంధిత అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వానాకాలం సీజన్‌ పెట్టుబడి సాయం కింద.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రూ.2,482.02 కోట్లు వెంటనే జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతులు ఉండగా.. వారికి ఉన్న కోటిన్నర ఎకరాల భూమికి.. రూ.9 వేల కోట్లను 9 విడతల్లో అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.రైతు భరోసా నిధుల జమ ఎలా చెక్ చేసుకోవాలి?మొదట https://rythubharosa.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు పైభాగంలో ఉన్న లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత లబ్ధిదారుడి పేరు, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.ఒకవేళ మీ వివరాలు లేకపోతే మొబైల్ నెంబర్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు.లాగిన్ అయిన తర్వాత ‘Beneficiary Status’ లేదా ‘Payment Status’ అనే ఆప్షన్ ఎంచుకోండి.ఆధార్ నెంబర్ లేదా పట్టాదారు పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.ఆ తర్వాత మీ డబ్బులు పడ్డాయా, ఏ అకౌంట్లో పడ్డాయి, ఎన్ని డబ్బులు పడ్డాయి అనే వివరాలు కనిపిస్తాయి.రైతు భరోసా డబ్బులు పడకుంటే ఏం చేయాలి?రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడతలో 2 ఎకరాలు కలిగిన రైతుల బ్యాంక్ అకౌంట్లో సీఎం రేవంత్ రెడ్డి నిధులు జమ చేశారు.బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడని రైతులు.. ఆ మండల పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)ని సంప్రదించాలి. లేకపోతే మండల వ్యవసాయ అధికారి (ఏఓ)ని సంప్రదించవచ్చు.డబ్బులు పడకపోవడానికి గల సరైన కారణాలను అధికారులు చెబుతారు. అసలు సమస్య ఏంటి, ఎందుకు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాలేదు అనే పూర్తి వివరాలు వెల్లడిస్తారు.ఆ తర్వాత పట్టాదారు పాస్ బుక్‌, ఆధార్ కార్డు, బ్యాంక్ అంకౌట్‌లో పేరు ఒకేలా ఉందా లేదా అని చెక్ చేసుకోండి.పేరు తప్పుగా ఉంటే డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది.ఇక ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వంటివి లింక్ అయ్యాయా లేదా చెక్ చేసుకోండి.టెక్నికల్ సమస్యల వల్ల డబ్బులు జమకాని రైతులు బ్యాంకు అకౌంట్ నంబర్లతో పాటు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను సరిచేసుకోవాలి.మరోవైపు.. కొత్తగా పాస్‌బుక్‌లు వచ్చిన వారు ఇంకా రైతు భరోసా జాబితాలో పేరు నమోదు కాకపోతే.. అలాంటి రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జూన్ 15వ తేదీ లోపు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ అందుకున్న రైతులు లేదా ఇప్పటివరకు రైతు భరోసా పథకంలో రిజిస్టర్ చేసుకోని రైతులు ఈనెల 5వ తేదీ లోపు తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)కి అవసరమైన పత్రాలను సమర్పించి అప్లై చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.