మళ్లీ బెంచ్‌కే పరిమితమైన వైభవ్.. ఊహించని ఆటగాడిని జట్టులోకి తీసుకున్న భారత్..!

Wait 5 sec.

.. అంతర్జాతీయ అరంగేట్రంపై నిరీక్షణ కొనసాగుతోంది. ఐపీఎల్‌ 2026తో సహా, ఇటీవల జరిగిన ట్రై సిరీస్‌లో పరుగుల వరద పారించిన అతడు.. 15 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ఎంపికయ్యాడు. కానీ ఇటీవల జరిగిన ఐర్లాండ్‌తో సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లోనూ అతడికి ప్లేయింగ్ లెవెన్‌లో చోటు దక్కలేదు. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.నిజానికి టీమిండియా మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో అతడికి అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. తొలి మ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అతడి పేరు లేదు. దీంతో అభిమానులు ఆశ్చర్యానికి, నిరాశకు గురయ్యారు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మలే ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. అయితే ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా ఎంపిక చేసిన తుది జట్టులో పలు ఆశ్చర్యకర నిర్ణయాలు ఉన్నాయి. ఏకంగా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లను భారత్ ప్లేయింగ్ లెవెన్‌లోకి తీసుకుంది. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిలకు చోటు కల్పించింది. మరి ఈ నిర్ణయం ఎంత వరకు విజయవంతం అవుతుందనేది తేలాల్సి ఉంది.ఇక ఈ మ్యాచ్‌లో తాము టాస్ గెలిచినా.. తొలుత బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చెప్పాడు. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లాండ్.. ఒకరోజు ముందే తమ ప్లేయింగ్ లెవెన్‌ను ప్రకటించింది.తుది జట్లు ఇవే..భారత్‌: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిఇంగ్లాండ్‌: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్‌), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్‌