ITR Filing Rules: పరిధిలోకి వచ్చేవారు ప్రతి ఏటా ఐటీ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. తమకు వచ్చే ఆదాయం, ఖర్చులు, పన్నులు, పెట్టుబడుల వంటి పూర్తి వివరాలు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగానికి ఐటీఆర్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే తాము చెల్లించిన అదనపు పన్నులను రీఫండ్ క్లెయిమ్ చేసుకునేందుకు ఐటీఆర్ ఒక్కటే మార్గం. అయితే, చాలా మంది ట్యాక్స్ పేయర్లు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్- ఐటీఆర్ ఫైల్ చేయడంతోనే తమ పని పూర్తయిపోయినట్లు భావిస్తుంటారు. భావిస్తే రీఫండ్ రాదు కదా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ను సరిగ్గా ధ్రువీకరించకపోయినా, సరిపోల్చకపోయినా లేదా పర్యవేక్షించకపోయినా అది రీఫండ్ ఆలస్యం కావడానికి, పన్ను డిమాండ్‌లకు లేదా ఆదాయపు పన్ను శాఖ నుంచి ట్యాక్స్ నోటీసులు జారీ అయ్యేందుకు దారితీస్తుంది. ఆటోమేటెడ్ రిటర్న్ ప్రాసెసింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రిస్క్ అసెస్‌మెంట్, థర్డ్-పార్టీ రిపోర్టింగ్ ద్వారా పన్నుల పరిపాలన టెక్నాలజీ ఆధారితంగా మారుతున్నందున.. రిటర్న్ దాఖలు చేయడం ఎంత ముఖ్యమో, దాఖలు చేసిన తర్వాత పాటించాల్సిన నిబంధనలను పాటించడం కూడా అంతే ముఖ్యం.ఫైలింగ్ చేసిన వెంటనే చేసే చురుకైన సమీక్ష భవిష్యత్తు నోటీసులను గణనీయంగా తగ్గించి, రీఫండ్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేస్తుంది. పన్ను చెల్లింపుదారులు తమ ITRను సమర్పించిన తర్వాత తప్పనిసరిగా చేపట్టవలసిన ఫైలింగ్ అనంతర చర్యలు కచ్చితంగా తెలుసుకోవాలి. 30 రోజులు మాత్రమేదానిని ఇ-వైరిఫై చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత వెరిఫై చేసేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్, ఎలక్ట్రానికి వెరిఫికేషన్ కోడ్, డీమ్యాట్ అకౌంట్, ఫిజికల్ సబ్మిషన్ వంటి ప్రాసెస్ ల ద్వారా వెరిఫై చేయవచ్చు. ఇ- వెరిఫై చేయడం ఇచ్చిన 30 రోజుల్లోగా విఫలమైతే ఆ రిటర్నులను ఇన్-వ్యాలిడ్‌గా పరిగణనిస్తారు. అంటే అప్పటి వరకు చేసిన పనంతా వృథా అయిపోతుంది. ట్యాక్స్ పేయర్ ఎలాంటి రిటర్న్ ఫైల్ చేయలేదని భావించి నోటీసులు పంపిస్తారు. మరోవైపు చాలా మంది ట్యాక్స్ పేయర్లు వివిధ ఛానళ్ల ద్వారా ఇ-వెరిఫై చేస్తారు. కానీ, సరిగ్గా వెరిఫై చేశామా, తాము చేసిన ప్రాసెస్ సిస్టమ్ యాక్సెప్ట్ చేసిందా లేదా ? అని తిరిగి చెక్ చేసుకోరు. ఇ-ఫైలింగ్ పోర్టల్ లోకి లాగిన్ అయి తమ స్టేటస్ చెక్ చేసుకోవాలి. సక్సెస్‌ఫుల్లీ ఫైల్డ్, సక్సెస్‌ఫుల్లీ వెరిఫైడ్ అనే ఆప్షన్లను చూసుకోవాలి. ఏదైనా సాంకేతిక కారణాలతో సక్సెస్ కాకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రీఫండ్ జారీ ఆగిపోతుంది. దీంతో పాటుగా ప్రీ-వ్యాలిడేటెడ్ బ్యాంక్ అకౌంట్లు మాత్రమే ట్యాక్స్ రీఫండ్ జమ అయ్యేందుకు అర్హత సాధిస్తాయి. పాన్ కార్డుతో లింక్ అయిన బ్యాంక్ ఖాతాను ప్రీ-వాలిడేట్ చేయాలి. లేదంటే రీఫండ్ ఆపేస్తారు.