నేతృత్వంలో ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 29వ తేదీన ఈ సభ జరగ్గా.. ఇందులో పాల్గొన్న వ్యక్తులు, వారి ప్రసంగాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితుల రిజర్వేషన్లు కొనసాగించడం సహా.. వారికి మతపరమైన స్వేచ్ఛ ఉండాలనే డిమాండ్‌తో ఈ సభ నిర్వహించారు. సభ ఉద్దేశం ఒకటి అయితే.. సభలో కొంతమంది వక్తల ప్రసంగాలు వివాదాస్పదమయ్యాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వివాదం ఒకెత్తు అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ప్రశ్న యూట్యూబర్ రావణ్ చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గిరాజేశాయి. ఈ క్రమంలోనే .. పిఠాపురం పోలీస్ స్టేషన్ తరలించారని వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగా.. ఈ పరిణామాలపై విజయ కృష్ణ స్పందించారు. 'జైభీమ్ పార్టీ' అధినేత జడ శ్రవణ్, ఆయన టీమ్ చేపట్టిన తీవ్రమైన మత, రాజకీయ ప్రచారం.. అనంతరం నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్టులు.. ఏపీలో పొలిటికల్ నెరేటివ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధికార కూటమికి సవాలు విసిరే లక్ష్యంతో క్రైస్తవ, దళిత ఓట్లపై దృష్టి సారించిన మరో రాజకీయ పార్టీతో కలిసి ఏపీ రాజకీయాన్ని మార్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. గుండెపోటుకు ముందు వచ్చే హెచ్చరిక సంకేతం లాంటిదే ఇది. ఇదే ధోరణి కొనసాగితే, వచ్చే ఎన్నికలు సిద్ధాంతాలు, ధర్మాల మధ్య జరిగే పోరుగా, రాజకీయ రంగంలో ఒక 'కలియుగ మహాభారతం'లా మారవచ్చు. గతంలో నా అంచనాలు నిజమయ్యాయి. కావున దీనిపై నిశితంగా గమనిస్తూ ఉండండి." అంటూ సినీ నటుడు నరేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు సమకాలీన అంశాలపై తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందిస్తుంటారు నరేష్. ఈ క్రమంలోనే ఇడుపు కాయితం అంశంపైనా, అలాగే రాజు వెడ్స్ రాంబాబు హీరో వివాదంపై కూడా స్పందించారు నరేష్. తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాలపై స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.