అయోధ్యలో కుంభమేళా సమయంలోనే భారీగా దోపిడీ.. సూత్రధారులు ఇద్దరు బావమరుదులే!

Wait 5 sec.

అయోధ్య అంశంపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పలువురి నిందితులను పోలీసులు విచారిస్తుండగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బయటపడింది. గతేడాది ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సమయంలోనే భారీగా దోచేసినట్టు విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితుల్లో కొందరు కుంభమేళాకు ముందు చిన్న మొత్తంలో దొంగిలించేవారు. కానీ, కుంభమేళా సమయంలో భారీగా భక్తులు, కానుకలు వెల్లువెత్తాయి. దీనిని ఆసరాగా చేసుకుని ఒకరితోకరు చేతులు కలిపిన నిందితులు పెద్ద ఎత్తున ఈ దోపిడీకి ఒడిగట్టారు.నిధుల గోల్‌మాల్‌పై దర్యాప్తునకు (SIT) ఆలయంలో పనిచేసే అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్‌లను అరెస్ట్ చేసింది. నిందితులను మంగళవారం గంటల తరబడి విచారించిన సిట్ అధికారులు.. ఈ ఎనిమిది మంది కలిసే కుట్ర పన్నారని స్పష్టం చేశారు.అయితే, లవ్‌కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే ఇద్దరు బావమరుదుల జోడి అధిక మొత్తంలో నగదును దొంగిలించినట్లు తేలింది. అంతేకాదు, తస్కరించిన ఈ సొమ్ముతో వారు పలు ఆస్తులను కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది. వీరిద్దరికీ సంబంధించి దాదాపు అర డజనుకుపైగా ఆస్తులను పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. వీరి ఆర్థిక లావాదేవీలు, ఆస్తులను నిశితంగా పరిశీలించేందుకు పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారుల సహాయం తీసుకుంటున్నారు. అలాగే, మనీల్యాండరింగ్, ఆర్థిక వ్యవహారాలపై లోతైన విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాయనున్నారు. విచారణలో కొందరు ఎస్బీఐ సిబ్బంది పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు.ఆలయంలో విరాళాల నగదు లెక్కింపును ఎస్బీఐ పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీని నియమించింది. నాలుగు విరాళాల పెట్టెలలో జమ చేసిన నగదును, 11 మంది బ్యాంకు సిబ్బంది, ఆలయ ట్రస్ట్ నుంచి ముగ్గురితో సహా మొత్తం 14 మంది సభ్యుల బృందం లెక్కిస్తుంది.నాలుగు పెట్టెల్లోని దుప్పట్లలో నగదునిందితుడు అవినాష్ శుక్లా కౌశల్‌పురిలోని రహస్య స్థావరం నుంచి అత్యధిక నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అవినాష్ శుక్లా సోదరుడు అభిషేక్‌కు సంబంధించిన యోగ కేంద్రంపై పోలీసులు జూన్ 5 దాడిచేసి భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అభిషేక్‌కు చెందిన నాలుగు పెట్టెలను యోగా కేంద్రంలో ఉంచారు. ఈ పెట్టెలలో దుప్పట్లలో నగదును దాచారు. ఒక పెట్టెపై 'రామ రాజ్య కోష్' అని రాసి ఉంది.యోగా కేంద్రం నడిపే సీమా తివారీ మాట్లాడుతూ.. దాడి, నగదు గురించి అభిషేక్‌ను అడిగితే తన సోదరుడు అవినాష్ శుక్లా ఔషధాల వ్యాపారం చేస్తున్నాడని, అందుకే దాడి జరిగిందని అన్నాడని తెలిపారు.మూడు రోజుల కిందట పోలీసులు నిందితులందరి ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ ఇంట్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. టిన్ను యాదవ్‌ వద్ద కౌంటింగ్‌ గదికి ఒక తాళం వేయగా, రెండో తాళం బ్యాంకు సిబ్బంది వద్ద ఉన్నట్లు విచారణలో తేలింది. బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై డబ్బులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దొంగిలించిన సొమ్మును టిన్ను యాదవ్, బ్యాంకు ఉద్యోగులు వాటాలు వేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.నిందితులందరి ఇళ్ల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి, వారి చర, స్థిరాస్తుల రికార్డులను రాబట్టారు. చోరీపై విచారణలో నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఆదాయానికి మించి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.