జులై నుంచి ఉద్యోగుల డీఏ ఎంత పెరగనుంది? 3 శాతమా లేక 4 శాతమా.. లేటెస్ట్ డేటా ఏం చెబుతుందంటే?

Wait 5 sec.

: , పెన్షనర్లకు 2026 జులై నుంచి పెరగబోయే డియర్‌నెస్ అలవెన్స్‌పై (DA) కొత్త అప్డేట్ వచ్చింది. ఏటా జనవరి, జులై నెలల్లో కేంద్రం డీఏను సవరిస్తుందన్న సంగతి తెలిసిందే. మే 2026 నెలకు సంబంధించి ఇండస్ట్రియల్ వర్కర్స్- ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPIN) గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ డేటా ప్రకారం జులై నుంచి ఉద్యోగులకు 3 శాతం లేదా 4 శాతం వరకు డీఏ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చివరిసారిగా 2026 . ఇప్పుడు ఇంకాస్త పెరగనుంది. 4 శాతం పెంపునకే అవకాశం..మే నెలలో ద్రవ్యోల్బణం, వస్తువుల ధరల ఆధారంగా ఏఐసీపీఐఎన్ ఇండెక్స్ పెరిగింది.జూన్ నెల డేటా కూడా వచ్చాక తుది లెక్క తేలుతుంది. కానీ ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ చూస్తే డీఏ కచ్చితంగా 3 శాతానికిపైగానే పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ జూన్ ఇండెక్స్ కూడా భారీగా పెరిగితే దాదాపు 4 శాతం వరకు డీఏ పెరుగుతుందని తెలుస్తోంది.డీఏ పెరిగితే దానికి అనుగుణంగా పెన్షనర్లకు డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. దీంతో కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు మేలు జరుగుతుందని చెప్పొచ్చు.ఒకవేళ 4 శాతం పెరిగితే ఉద్యోగుల మొత్తం డీఏ ప్రస్తుతం ఉన్న 60 శాతం నుంచి 64 శాతానికి చేరుతుందని చెప్పొచ్చు. దీనికి అనుగుణంగా ఉద్యోగులకు చేతికి అందే అందే జీతం పెరుగుతుంది. డీఏ అనేది ఉద్యోగుల బేసిక్ పే పై వర్తిస్తుంది.ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న ధరలకు పరిహారంగా కేంద్రం ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ప్రకటిస్తుంటుంది. దాదాపు ప్రతిసారీ ఇది పెరుగుతూనే ఉంటుంది. ఇండస్ట్రియల్ వర్కర్స్ ద్రవ్యోల్బణం డేటా ఆధారంగా దీనిని నిర్ణయిస్తుంటుంది. కేంద్రం ఏటా జనవరి, జులై నుంచి డీఏ అమలు చేయాల్సి ఉంటుంది. ఇలానే అమలు చేస్తున్నా ప్రకటన మాత్రం ఆలస్యంగా వస్తోంది. ఏటా తొలి అర్ధభాగంలో హోలీ సమయంలో మార్చి లేదా ఏప్రిల్‌లో ఒకసారి, రెండో అర్ధభాగంలో దసరా/దీపావళి సమయంలో సెప్టెంబర్/అక్టోబర్ కాలంలో ప్రకటిస్తూ వస్తోంది. ఆలస్యంగా ప్రకటించినా జనవరి 1, జులై 1 నుంచే అమలు చేసి పెండింగ్ నెలల బకాయిల్ని విడుదల చేస్తుంటుంది. ప్రస్తుతం సిఫార్సుల ఆధారంగా డీఏ పెంచుతుండగా.. మరికొన్ని నెలల్లో 8వ వేతన సంఘం రాబోతుంది. అప్పుడు ఈ డీఏ బేసిక్ పేలో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మళ్లీ డీఏ/డీఆర్ జీరో శాతం నుంచి మొదలవుతుందన్న చర్చ మొదలైంది.