విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త..!

Wait 5 sec.

గాయం కారణంగా అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ .. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు సిద్ధం అవుతున్నాడు. జులై 14 నుంచి జరగనున్న ఈ సిరీస్‌ కోసం ఈ జట్టులో విరాట్ కోహ్లీకి సైతం చోటు దక్కింది. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే అతడు బరిలోకి దిగుతాడని కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేశాడు. గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి విరాట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు.. కింగ్ వచ్చేస్తున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ రీఎంట్రీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంటున్నారు.టెస్ట్, టీ20లకు గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం కేవలం 50 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027లో కచ్చితంగా ఆడాలని పట్టుదలతో ముందుకెళ్తున్నాడు. దీంతో అతడు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ సైతం వన్డే ప్రపంచకప్‌లో ఆడాలంటే.. ఇంగ్లాండ్ గడ్డపై సత్తాచాటడం ముఖ్యం. ఇక ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. కానీ కాస్త విరామం తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా.. తిరిగి జట్టులోకి వచ్చాడు.ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మ‌న్ గిల్ (కెప్టెన్), రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్య‌ర్‌ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్‌ (వికెట్ కీప‌ర్), ఇషాన్ కిష‌న్‌ (వికెట్ కీప‌ర్), వాషింగ్ట‌న్ సుంద‌ర్, కుల్‌దీప్ యాద‌వ్, నితీశ్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్ర‌సిధ్ కృష్ణ‌, హ‌ర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్.భారత్ vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్..తొలి వన్డే: జులై 14, బర్మింగ్‌హామ్రెండో వన్డే: జులై 16, కార్డిఫ్మూడో వన్డే: జులై 19, లార్డ్స్