నీట్, జేఈఈ అడ్మిషన్లలో ఇంటర్ మార్కులకు 50% వెయిటేజ్.. కేంద్రం సంచలన నిర్ణయం?

Wait 5 sec.

ప్రస్తుతం , వంటి ప్రవేశ పరీక్షల స్కోరింగ్ ఆధారంగానే మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఇకపై బోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కులకు నీట్, జేఈఈ వంటి అడ్మిషన్లలో 50 శాతం వెయిటేజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వైద్య, ఇంజినీరింగ్ ఎంట్రన్స్ లేదా బోర్డు పరీక్షలు ఇలా ఏ పరీక్షలోనైనా ఉండే అధిక ప్రాధాన్యతను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన పరిశీలిస్తున్నారు. అంతేకాదు, విద్యార్థులకు ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని తగ్గించాలనే ఆలోచనతో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నాయి.మూల్యాంకన లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీలతో సహా పరీక్షా విధానంలో జరిగిన వరుస అవకతవకలు, విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ‘‘ప్రవేశాలు లేదా మెరిట్ జాబితా రూపకల్పనలో బోర్డు మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇవ్వడం, కోచింగ్ సెంటర్లపై విద్యార్థుల ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎంట్రన్స్ పరీక్షల విధానాన్ని పాఠశాల సిలబస్‌కు అనుగుణంగా మార్చడం, పరీక్షలు రాసేందుకు బహుళ అవకాశాలు కల్పించడం,క్రమంగా డిమాండ్‌ను బట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్లడం వంటి మార్పులను ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది’ అని ఒక అధికారి తెలిపారు.ప్రస్తుతం, వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు అర్హత పరీక్షల స్కోర్‌ల ఆధారంగా జరుగుతున్నాయి. ప్రవేశ పరీక్షలకు అర్హత సాధించడానికి అభ్యర్థులు బోర్డు పరీక్షలలో అర్హత శాతాన్ని సాధించాల్సి ఉంటుంది. విద్యార్థులు కోచింగ్‌పై ఆధారపడటం, 'డమ్మీ స్కూల్స్' వ్యాప్తి, అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలలో నిష్పక్షపాతం తదితర అంశాల అధ్యయనం కోసం గతేడాది కేంద్ర విద్యా శాఖ ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యుల కమిటీ ఈ సంస్కరణలను పరిశీలిస్తోంది.కాగా, గతంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ వంటి ప్రవేశ పరీక్షల్లో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఇచ్చేవి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విధానం కొనసాగింది. కానీ, 2023లో దీనిని రెండు రాష్ట్రాలూ రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మళ్లీ కేంద్రం ఇప్పుడు ఈ ప్రతిపాదన తీసుకురావడం చర్చ జరుగుతోంది.