PPF Interest Rate: సురక్షితమైన పెట్టుబడితో పాటు మెరుగైన రాబడి, పన్ను మినహాయింపులు కోరుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒక అద్భుతమైన పథకం. ఈ పథకంలో 15 ఏళ్ల పాటు పొదుపు చేస్తే పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పడుతుందని చెప్పవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి త్రైమాసికానికి ఒకసారి వడ్డీ రేట్లను సమీకిస్తుంది. ఈ నేపథ్యంలో ఖరారు చేసింది. ప్రస్తుతం పీపీఎఫ్ వార్షిక వడ్డీ రేటు 7.10 శాతంగా ఉండగా అదే వడ్డీ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నామని ప్రకటించింది.దీంతో పీపీఎఫ్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఒకప్పుడు 12 శాతానికి పైగా వడ్డీ రేటు ఇచ్చిన ఈ పథకంలో దాదాపు 6 ఏళ్లుగా 7.10 శాతం వడ్డీ రేటునే కొనసాగిస్తుండడంతో పెట్టుబడిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులపై అధిక రాబడి వస్తుందని భావించి ఇన్వెస్ట్ చేస్తున్నా కేంద్రం మాత్రం మొండి చేయి చూపిస్తున్నట్లు చెబుతున్నారు. 2020, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పీపీఎఫ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా కేంద్ర స్థిరంగా కొనసాగిస్తూ వస్తోంది. 6 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత ఇప్పుడైనా వడ్డీ రేటు పెంచుతారేమో అని భావించిన వారికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో పీపీఎఫ్ వడ్డీ రేట్ల చరిత్రను ఓసారి పరిశీలిద్దాం. వార్షికంగా కాంపౌండింగ్ అవుతుంది. ఏప్రిల్ 2020 నుంచి అంటే దాదాపు 6 ఏళ్లుగా ఈ వడ్డీ రేటు మారలేదు. ఈ పథకంలో EEE(Exempt- Exempt- Exempt) ట్యాక్స్ మినహాయింపు కేటగిరీ కిందకు వస్తుంది. అంటే పెట్టే పెట్టుబడి, వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ అమౌంట్ పై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అయితే, ఇందులో 15 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. కానీ, 15 ఏళ్ల పాటు వడ్డీపైన వడ్డీ జనరేట్ అవుతూ పెద్ద మొత్తంలో కార్పస్ చేతికి రావడం, ఎలాంటి ట్యాక్స్ లేకపోవడంతో ఎక్కువ మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అప్పుడు 12 శాతం వడ్డీ.. చరిత్ర ఇదే2020 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 7.10 శాతం2019 జులై- 2020 మార్చి వరకు 7.90 శాతం2018 అక్టోబర్- 2019 జూన్ వరకు 8.00 శాతం2018 జనవరి- 2018 సెప్టెంబర్ వరకు7.60 శాతం2016 ఏప్రిల్- 2017 డిసెంబర్ వరకు 8.10 శాతం2013 ఏప్రిల్- 2016 మార్చి వరకు 8.70 శాతం2012 ఏప్రిల్- 2013 మార్చి8.80 శాతం2011 డిసెంబర్- 2012 మార్చి8.60 శాతం2003 నుంచి 2011 వరకు 8.00 శాతం2000 నుంచి 2003 వరకు 8 శాతం నుంచి 9.50 శాతం వరకు1986 నుంచి 2000 వరకు 12 శాతం (ఆల్ టైమ్ హై)1979 నుంచి 1986 వరకు 8.00 శాతం1968 నుంచి 1978 వరకు 4.80 శాతం