ప్రకటించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది., మావిగన్ కావాలని అనుకునేవారు వైసీపీకి ఓటేస్తారని.. ఏం జరుగుతుందో చూద్దామంటూ రాజధాని గురించి చాలా స్పష్టంగా వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పేశారు జగన్. అయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో కూడిన MAVIGUN అనే సరికొత్త రాజధాని అజెండాను జగన్ ప్రకటించడం వెనుక బలమైన రాజకీయ, ఆర్థిక వ్యూహాలు ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. జగన్ ఇలాంటి ప్రకటన చేయడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా భారం.. , వైసీపీ పార్టీ చెప్తున్న ప్రకారం అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకే లక్షల కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారుతుందని.. ఏపీ అప్పులలో కూరుకుపోతుందని జగన్ అభిప్రాయం. అమరావతికి ప్రత్యా్మ్నాయంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ, గుంటూరు, మచిలీపట్నాలను కలిపి మావిగన్ మెట్రోపాలిటన్ రీజియన్ పేరుతో ఏర్పాటు చేస్తే.. తక్కువ ఖర్చుతోనే వేగంగా రాజధాని ప్రాంతం అందుబాటులోకి వస్తుందని జగన్ చెప్తున్నారు. నిర్మాణానికి పెట్టే వ్యయంలో కేవలం పదిశాతంతోనే రాజధాని అందుబాటులోకి వస్తుందనేది జగన్ వాదన. మూడు రాజధానుల బదులుగా ప్లాన్ బి..వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు వైఎస్ జగన్. అమరావతి, విశాఖ, కర్నూలను రాజధానులుగా అభివృద్ధి చేయాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం భావించింది. ఇదే విధానంతో 2024 ఎన్నికలకు వెళ్లగా.. వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. దీంతో వైఎస్ జగన్ ఈసారి ప్లాన్ మార్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంత ఓటర్లను కూడా ఆకట్టుకునేలా, కోస్తాంధ్రలో పట్టు సాధించేందుకు మావిగన్ తెరపైకి తెచ్చారని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు బ్రాండ్ దెబ్బతీయడమే లక్ష్యమా..ఇక అమరావతి అనేది చంద్రబాబు కలల ప్రాజెక్టు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పదే పదే చెప్తుంటారు. అయితే చంద్రబాబుకి కౌంటర్‌గా అంతకంటే పెద్దది, వాస్తవానికి దగ్గరగా ఉంటుందని వైసీపీ చెప్తున్న మావిగన్ అంశాన్ని తెరపైకి తేవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కూటమికి బలమైన సవాల్ విసరవచ్చని జగన్ భావిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామాన్య ప్రజానీకం టార్గెట్మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణంలో భారీగా అవినీతి జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తోంది. అమరావతి టీడీపీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమేనని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. అమరావతిలా కాకుండా మావిగన్ సామాన్య ప్రజలు, వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటుందని జగన్ వాదన. మావిగన్ ద్వారా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని చూపించడం జగన్ ఉద్దేశం. పొలిటికల్ మైలేజీ..మూడు రాజధానుల అంశంతో గత ఎన్నికలకు వెళ్లిన వైసీపీ ఘోరంగా నష్టపోయింది. పట్టున్న రాయలసీమ ప్రాంత ఓటర్లతో పాటుగా, విశాఖపట్నం వాసులు కూడా వైసీపీని తిరస్కరించారు. ఇక గుంటూరు, కృష్ణా ప్రాంతాలలో అయితే చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం పోర్టును విజయవాడ, గుంటూరులతో అనుసంధానిస్తామనే ప్రకటన ద్వారా ఆయా జిల్లాల ప్రజలు, యువతలో ఉపాధి ఆశలు రేకెత్తించి, గత ఎన్నికల్లో కోల్పోయిన రాజకీయ మైలేజీని తిరిగి సాధించాలనేది కూడా ఓ వ్యూహమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పంచతంత్ర వ్యూహాలతోనే అమరావతికి పోటీగా మావిగన్ అనే సరికొత్త సెంటిమెంట్‌ను 2029 నాటికి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు.. ఆ దిశగా బుధవారం నాటి ప్రకటన తొలి అడుగుగా అభివర్ణిస్తున్నారు.