ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఫ్రాంఛైజీలు, ఆటగాళ్ల విషయంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిషభ్ పంత్.. లక్నోనూ వీడి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరిపోయాడు. కుల్‌దీప్ యాదవ్.. డీసీని వదిలేసి లక్నో క్యాంప్‌లోకి వెళ్లాడు. తాజాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ సైతం.. ఇదే బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది. గత మూడు సీజన్లుగా ముంబై కెప్టెన్‌గా ఉన్న అతడు.. ఈ వార్తలకు తోడు.. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైని వీడనున్న హార్దిక్ పాండ్యాను దక్కించుకునేందుకు ఏకంగా ఏడు ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. సరైన సారథి లేక ఇబ్బంది పడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌, రాజస్థాన్ రాయల్స్ సైతం పాండ్యాను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మాత్రం ఈ ప్లేయర్ కోసం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి.కాగా ఇటీవల హార్దిక్ పాండ్యా.. తన నివాసాన్ని ముంబై నుంచి బెంగళూరుకు షిఫ్ట్ చేశాడు. తన కెరీర్‌ కొనసాగించినంత కాలం బీసీసీఐ సెంటర్ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ని శాశ్వత శిక్షణా కేంద్రంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలో శిక్షణ కోసం ప్రతిరోజూ చాలా దూరం ప్రయాణించడం సమస్యగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై ఐపీఎల్, జాతీయ జట్టు తరఫున మ్యాచ్‌లు లేనప్పుడల్లా పాండ్య బీసీసీఐ సెంటర్ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా.. ఇటు కెప్టెన్‌గా, అటు ఆటగాడిగా నిరాశపర్చాడు. ఈ సీజన్‌లో ముంబై 14 మ్యాచ్‌లలో నాలుగింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. దానికి తోడు హార్దిక్ పట్ల.. ముంబై ఫ్రాంఛైజీ కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను ముంబైని వీడే అంశంపై త్వరలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.