జన్మతః పౌరసత్వ హక్కు ఉండాల్సిందే.. సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ

Wait 5 sec.

జన్మతః పౌరసత్వ హక్కు రద్దు విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దుచేస్తూ వెలువరించిన కార్యనిర్వహాక ఉత్తర్వులను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యతిరేకించింది. జన్మతః పౌరసత్వ హక్కు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో చట్టాన్ని రద్దుచేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలకు గండిపడింది. గతేడాది అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను చెలాయిస్తున్న విస్తృత అధికారాలకు పరాకాష్టగా ట్రంప్ తీసుకొచ్చిన ప్రతీకార సుకాలను కొన్ని నెలల క్రితమే కోర్టు రద్దు చేసింది. జా తీర్పుతో ట్రంప్ అధికార దాహానికి మరోసారి బ్రేక్ పడినట్లయింది.గత వారం వలసదారులను దేశ బహిష్కరణ నుంచి రక్షణ కల్పించే నిబంధనలను ముగించేందుకు ట్రంప్‌నకు అనుమతించిన తీర్పుతో సహా ఇతర వలస కేసులలో న్యాయమూర్తులు అధ్యక్షుడి అధికారాలకే మద్దతు పలికారు. కానీ, తాజా నిర్ణయంలో మాత్రం.. కేవలం ఒక సంతకంతో పుట్టుకతో వచ్చే పౌరసత్వం నిర్వచనాన్ని ట్రంప్ మార్చలేరని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్.. అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు కూడా 14వ సవరణలోని పౌరసత్వ నిబంధనకు అర్హులని పేర్కొన్నారు.‘‘అప్పుడు, ఇప్పుడు కూడా పౌరసత్వం అనేది హక్కులను కలిగి ఉండే హక్కు.. మన రాజకీయ సమాజంలో స్వేచ్ఛగా భాగస్వామ్యం పంచుకోవడం.. 14వ సవరణ రూపకర్తలు ఆ వాగ్దానాన్ని ‘ఈ దేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికి’ విస్తరించారు. ఈ రోజు మనం ఆ వాగ్దానాన్ని నిలబెడుతున్నాం’’ అని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ రాశారు.కానీ, కోర్టులోని ఇతర ముగ్గురు కన్జర్వేటివ్ న్యాయమూర్తులు జస్టిస్ క్లారెన్స్ థామస్, జస్టిస్ శామ్యూల్ అలిటో, జస్టిస్ నీల్ గోర్సచ్‌లు ఈ తీర్పుతో విభేదించారు. ఈ నిర్ణయం అమెరికా పౌరసత్వ విలువను తగ్గిస్తుందని, ఇది కాలపరీక్షకు నిలిచే అవకాశం లేదని థామస్ అన్నారు.