Zero : భారతదేశంలో ఆదాయ పన్నును వ్యక్తిగతంగానే లెక్కిస్తారు, కానీ కుటుంబం మొత్తానికి కలిపి లెక్కించరు. అయితే ఒక ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) చిరాగ్ చౌహాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఉదాహరణ ప్రకారం ఒక ఇంట్లో నలుగురు సంపాదిస్తున్నప్పుడు, ఐటీ చట్టంలోని వేర్వేరు సెక్షన్లను వాడుకుంటూ రూ. 40 లక్షల ఉమ్మడి ఆదాయంపై పైసా కూడా టాక్స్ లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చట్టబద్ధమైన లెక్కలతో వివరించారు. ఆ స్మార్ట్ ప్లాన్ గురించి ఇప్పుడు చూద్దాం. దీనిపై నెట్టింట విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇక్కడ ఇంకా రూ. 40 లక్షల ఆదాయంలో బిజినెస్ టర్నోవర్ కోట్లు ఉంది. రూ. 1 కోటి ఎఫ్‌డీ ఉంది. అయినా టాక్స్ పడకపోవడానికి కారణాలేంటన్న చర్చ జరుగుతోంది.అయితే కొత్త ఆదాయపు పన్ను విధానంలో కొన్ని పరిస్థితుల్లో ఇది చట్టబద్ధంగానే సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కుటుంబ మొత్తం ఆదాయంపై టాక్స్ మినహాయింపు కానే కాదు. ప్రతి వ్యక్తి ఆదాయాన్ని విడివిడిగా లెక్కించే భారత ఆదాయపు పన్ను విధానం వల్ల ఈ అవకాశం ఏర్పడుతుంది. చిరాగ్ చౌహాన్ ట్వీట్ ప్రకారంకుటుంబంలో నలుగురు సభ్యులు- వారి ఆదాయాలు ఇలా ఉన్నాయి. తండ్రి- బిజినెస్ టర్నోవర్ రూ. 2 కోట్లుతల్లి- రూ. 1 కోటి ఫిక్స్‌డ్ డిపాజిట్‌కొడుకు- రూ. 10 లక్షల వార్షిక జీతంకూతురు- రూ. 12 లక్షల వార్షిక జీతంఇలా వీరందరి ఆదాయం కలిపి రూ. 40 లక్షలవుతుంది. పన్ను జీరో అని చెబుతున్నారు. తండ్రికి రూ. 2 కోట్ల టర్నోవర్ ఉన్నా జీరో టాక్స్ ఎందుకు?ఇక్కడే చాలా మంది పొరబడతారు. టర్నోవర్‌ను ఆదాయంగా భావించరు. అసలు విషయం ఇది కాదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 44AD ప్రకారం చిన్న వ్యాపారులకు ప్రత్యేక విధానం ఉంది. వ్యాపార టర్నోవర్ నిర్ణీత పరిమితిలో ఉన్నట్లయితే ప్రతి ఖర్చు లెక్క చూపాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఒక నిర్దిష్ట శాతాన్ని లాభంగా పరిగణిస్తుంటుంది. ఉదాహరణకు రూ. 2 కోట్ల టర్నోవర్ ఉన్నప్పుడు.. ఎక్కువ లావాదేవీలు డిజిటల్ రూపంలో జరిగితే లాభం 6 శాతం అంటే రూ. 12 లక్షలుగా ఉంటుంది. దీనిపైనే టాక్స్ లెక్కిస్తారు. ఈ రూ. 12 లక్షల్ని ప్రిస్యుంప్టివ్ ఆదాయం అంటారు. సెక్షన్ 87A టాక్స్ రిబేట్ కింద ఈ ఆదాయంపై టాక్స్ పడదు. తల్లి దగ్గర రూ. కోటి ఎఫ్‌డీపైనా జీరో టాక్స్రూ. 1 కోటి ఎఫ్‌డీపై ఏడాదికి 6 శాతం వడ్డీగా చూస్తే రూ. 6 లక్షల వడ్డీ ఆదాయం వస్తుంది. ఇది ఆమె (గృహిణి) వ్యక్తిగత ఆదాయంగానే పరిగణిస్తారు. ఇక్కడ రూ. కోటి డిపాజిట్ ఆమె భర్త బహుమతిగా ఇచ్చినట్లయితే, ఆ వడ్డీ ఆదాయాన్ని కొన్ని సందర్భాల్లో భర్త ఆదాయంలో కలిపి లెక్కించే అవకాశం ఉంటుంది. ఈ ఉదాహరణ ప్రతి కుటుంబానికి యథాతథంగా వర్తించదు.ఇక కొడుకు, కూతురు ఆదాయాలు వరుసగా రూ. 10 లక్షలు, రూ. 12 లక్షలుగా ఉన్నాయి. కొత్త పన్ను చట్టం ప్రకారం వేతన జీవులకు రూ. 12.75 లక్షల వరకు టాక్స్ పడదు. కాబట్టి వీరి ఆదాయంపై టాక్స్ ఉండదని గమనించాలి.అసలు ప్లానింగ్ ఇదేపైకి చూస్తే ఇది ఎవరి ఆదాయం వారిదే కదా, ఇందులో టాక్స్ ప్లానింగ్ ఏముందిలే అనిపించొచ్చు. కానీ దీంట్లో రెండు ముఖ్యమైన లీగల్ ట్రిక్స్ ఉన్నాయి. ఒకటి హై టాక్స్ బ్రాకెట్‌లో ఉన్న భర్త లేదా కొడుకు తమ సొంత పేరు మీద ఎఫ్‌డీ చేయకుండా, అసలు ఆదాయం లేని హౌస్‌వైఫ్ పేరు మీద రూ. 1 కోటి ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీగా టాక్స్ ఆదా చేశారు. రెండోది వ్యాపార ఆదాయాన్ని సెక్షన్ 44AD ద్వారా స్మార్ట్‌గా చూయించడం. ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఆదాయాన్ని విడదీయడం వల్లే ఎవరూ టాక్స్ చెల్లించకుండా చూసుకోగలిగారు. భారత ఆర్థిక వ్యవస్థలో కుటుంబ ఆదాయం అనే కాన్సెప్ట్ లేదు. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక పన్ను చెల్లింపుదారుడే. తండ్రి ఆదాయం విడిగా, తల్లి ఆదాయం విడిగా, కొడుకు, కూతురు ఆదాయం కూడా విడిగా చూస్తారు. దీని వల్లే చట్టబద్ధంగా టాక్స్ ప్లాన్ చేసే వీలుంటుంది. అయితే పైన చెప్పింది వారి కుటుంబానికి మాత్రమే వర్తిస్తుంది. అందరికీ యథాతథంగా ఇలానే ఉండవు. వారి వారి ఆదాయాల్ని బట్టి.. చట్టపరంగా పన్ను విధానాల్ని బట్టి టాక్స్ పడుతుంది. టర్నోవర్ పరిమితులు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిష్పత్తి, వ్యాపార అర్హతలు, టాక్స్ రిబేట్ ఇలా అన్నింటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే టాక్స్ ప్లాన్ చేసే ముందు తప్పనిసరిగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ (CA) సలహా తీసుకోవడం మంచిది.