వినుత కోట దంపతుల ఫోటోలతో తప్పుడు ప్రచారం చేయొద్దు.. వాళ్లు నన్ను కలవలేదు: రామ్ తాళ్లూరి

Wait 5 sec.

జనసేన పార్టీలో కీలక పరిణామం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఇంఛార్జ్ , చంద్రబాబు కోటలు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరిని హైదరాబాద్‌లోని నివాసంలో కలిసినట్లు ఫోటో చక్కర్లు కొడుతోంది. కొందరు ఈ ఫోటోను ట్వీట్, పోస్ట్ చేసి నుంచి పిలుపు రావడంతో వారిద్దరు వెళ్లి కలిసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‌ ఆదేశాలతోనే ఈ సమావేశం నిర్వహించినట్లుగా చర్చ జరుగుతోంది. వారిద్దరికి సంబంధించి పార్టీపరంగా కీలక నిర్ణయం తీసుకునేలా చర్చ జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా వినుత కోట దంపతుల ఫోటో వైరల్ కావడంతో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి స్పందించారు. అందరూ అనవసరమైన ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరుతున్నామన్నారు. సోషల్ మీడియాలో వినుత కోట, చంద్రబాబు కోట తనను కలిసినట్లుగా ప్రచారం చేస్తోన్న ఫోటోలు.. వారిద్దరు పార్టీలో ఉన్నప్పటివి, పాతవి అని క్లారిటీ ఇచ్చారు. ఇలా సందర్భం లేకపోయినా పాత ఫోటోలను షేర్ చేసి అనవసరమైన అపార్థాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. పాత ఫోటోలతో తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయొద్దు.. కేవలం అధికారిక సమాచారాన్ని నమ్మాలని సూచించారు.శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్‌గా పనిచేసిన కోట వినుత గతేడాది తన డ్రైవర్ రాయుడు హత్య కేసులో అరెస్ట్ అయ్యారు.. వెంటనే ఆమెను జనసేన పార్టీ నుంచి బహిష్కరించారు. శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెంకు చెందిన శ్రీనివాసులు అలియాస్‌ రాయుడు గతేడాది దారుణ హత్యకు గురయ్యాడు. జనసేన కార్యకర్తగా ఉన్న రాయుడు కోట వినుత, చంద్రబాబు దంపతుల ఇంట్లో సహాయకుడిగా, కారు డ్రైవర్‌గా చేరాడు. గతేడాది జూన్ 22న అనూహ్యంగా రాయుడికి తమకు ఎలాంటి సంబంధం లేదని వినుత దంపతులు ప్రకటించారు. ఆ తర్వాత 15 రోజులకు రాయుడు మృతదేహాన్ని చెన్నైలో గుర్తించారు. అతడి హత్యకు వినుత దంపుతులు కారణమని చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు. చెన్నై పోలీసులు వినుత, చంద్రబాబులను అరెస్ట్ చేశారు. వీరిద్దరికి కోర్టు బెయిల్ మంజూర్ చేయగా.. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. రాయుడు హత్య కేసులో తమను కుట్రపూరితంగా ఇరికించారని.. తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని కోట వినుత చెప్పుకొచ్చారు. ఈ హత్యకేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. చేయని తప్పుకు తాను, తన భర్త జైలు శిక్ష అనుభవించామన్నారు. విదేశాల్లో లక్షల్లో జీతాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సాయం చేద్దామనుకున్నామని.. మనుషుల్ని చంపడానికి రాలేదన్నారు. త్వరలోనే ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తామని ప్రకటించారు. వినుత కోట 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా శ్రీకాళహస్తి సీటు టీడీపీకి వెళ్లగా ఎమ్మెల్యేగా సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినుత కోట, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య విభేదాలు నడిచాయి. ఇంతలో ఆమె ఈ హత్యకేసులో అరెస్ట్ అయ్యారు.