గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. జులై 2న హైదరాబాద్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే

Wait 5 sec.

Gold Prices: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, అమెరికా ఇన్‌ఫ్లేషన్, జాబ్ డేటా, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ పుంజుకోవడం వంటి చాలా అంశాలు బంగారం ధరలు పడిపోయేందుకు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు పెరుగుతాయన్న భయాలూ బంగారం ధరలను పడేస్తున్నాయి. జూన్ నెలలో పసిడి ధరలు ఏకంగా 13 శాతం మేర పడిపోయిన సంగతి తెలిసింది. అయితే, పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం రేట్లలో ఎప్పుడు ఏ మార్పు ఉంటుందో సరిగ్గా అంచనా వేయలేని పరిస్థితులు కొనసాగుతున్నాయి. జులై 2వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్ ధరలుఅంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త చల్లారడంతో బంగారం రేట్లు పెరిగాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 39 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4064 డాలర్ల వద్దకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.57 శాతం మేర పెరిగి 59.78 డాలర్ల స్థాయికి ఎగబాకింది. హైదరాబాద్‌లో బంగారం ధరలుహైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.1260 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,40,780 వద్దకు తగ్గింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1150 మేర తగ్గడంతో తులం రేటు రూ.1,29,050 వద్దకు దిగివచ్చింది. వారం రోజులుగా స్థిరంగానే వెండిబంగారం ధరల్లో భారీ మార్పులు జరుగుతున్నా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. గత వారం రోజులుగా సిల్వర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.2,45,000 మార్క్ వద్ద స్థిరంగా అమ్ముడవుతోంది. అయితే గ్లోబ్ల మార్కెట్లో ధరలు పెరిగిన క్రమంలో దేశీయంగానూ పెరిగే అవకాశం కనిపిస్తోంది. గమనిక: పైన చెప్పిన బంగారం, వెండి ధరలు జులై 2వ తేదీ గురువారం రోజు ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు 10 గంటల తర్వాత మారుతుంటాయి. దీంతో పాటు ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. కొనుగోలు చేసే ముందే మీ ప్రాంతంలోని ధరలను తెలుసుకోవడం మంచిది.