ఇజ్రాయెల్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. అమెరికా మాటలు వినకపోతే గుణపాఠం తప్పదంటూ హెచ్చరిక!

Wait 5 sec.

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ కౌంటర్ ఇచ్చారు. అమెరికా మాట వినకపోతే ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మళ్లీ తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సుప్రీం నేత అలీ కమేనీపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలీ కమేనేని హతమార్చడమే లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెప్పడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తెల్ అవీన్‌లోని తమ మిత్రులను అదుపులో ఉంచుతామని హామీ ఇచ్చింది అంటూ అబ్బాస్ అరాఘ్చీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇస్లామాబాద్ ఒప్పందం ప్రకారం అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్‌ను అదుపులో ఉంచాలని చెప్పారు. READ ALSO ఇజ్రాయెల్‌కు గుణపాఠం చెబుతాం"ఇజ్రాయెల్ తమ యజమాని అమెరికా మాట వినకపోతే ఇరాన్ వారికి గుణపాఠం చెబుతుంది. మా ప్రజలు లేదా ఇరాన్ నాయకత్వంపై ఎలాంటి బెదిరింపులు వచ్చినా వెంటనే ప్రతిస్పందన ఉంటుంది" అని హెచ్చరించారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసేందుకు ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్ మరోసారి దాడి చేస్తే అమెరికా సైనిక సహకారం ఉన్నా లేకపోయినా.. ఇజ్రాయెల్ తమ శక్తిమేరకు ప్రతిదాడి చేస్తుందని తేల్చి చెప్పారు. READ ALSO దోహాలో అమెరికా-ఇరాన్ చర్చలుస్విట్జర్లాండ్‌లో తొలిదఫా చర్చల అనంతరం ప్రస్తుతం ఖతర్ రాజధాని దోహాలో ఇరాన్ - అమెరికా మధ్య సాంకేతిక చర్చలు నిర్వహించారు. ఈ చర్చల్లో హార్మూజ్ జలసంధి నుంచి నౌకాయానాన్ని సురక్షితంగా కొనసాగించడం, కాల్పుల విరమణను శాశ్వతంగా అమలు చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గత నెల కుదిరిన 14 అంశాల తాత్కాలిక ఒప్పందం ఆధారంగా ఈ చర్చలు కొనసాగుతున్నాయని, యుద్ధాన్ని శాశ్వతంగా ఆపేయడానికే ఇవి జరుగుతున్నట్లు తెలుస్తోంది. శాశ్వత శాంతి ఒప్పందం కోసం 60 రోజుల చర్చలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఇరుదేశాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.