: స్టాక్ మార్కెట్లో ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టే వారికి అద్విత్ జువెల్స్(రాంభాజో) మంచి లాభాల్ని అందించింది. ఈ రోజే (జులై 1) మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జువెల్లరీ ఐపీఓ షేర్లు ఇన్వెస్టర్ల అంచనాల్ని అందుకుంటూ అదిరిపోయే ప్రీమియంతో లిస్టయ్యాయి. ఎన్ఎస్ఈలో 36.88 శాతం ప్రీమియంతో రూ. 188.90 వద్ద లిస్టింగ్ అయింది. ఇష్యూ ధర కేవలం రూ. 138 గానే ఉంది. దీంతో ఒక్కో షేరుపై ఎంట్రీతోనే రూ. 50.90 కిపైగా లాభాల్ని అందించిందన్నమాట. సక్సెస్‌ఫుల్‌గా ఐపీఓ అలాట్‌మెంట్ పొందిన వారు పండగ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అద్విత్ జువెల్స్ రాజస్థాన్ జైపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న ప్రముఖ నగల సంస్థ. రాంభాజో బ్రాండ్ పేరిట చేతితో ఆభరణాల్ని తయారు చేసి విక్రయిస్తోంది. దీనికి వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. ఇక పెట్టుబడి, రాబడి పరంగా చూస్తే ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 130- రూ. 138 వరకు ఉండగా చివరికి ఇష్యూ ప్రైస్‌ను రూ. 138 గా నిర్ణయించింది. ఒక్కో లాట్ కింద 100 షేర్లను కేటాయించగా ఈ లెక్కన పెట్టుబడి రూ. 13800 గా ఉంటుంది. లిస్టింగ్‌తో చూస్తే రూ. 188.90 దగ్గర రూ. 18,890 రాబడి వచ్చింది. ఈ లెక్కన ఒక్కో షేరుకు రూ. 50.90 చొప్పున పెరగ్గా 100 షేర్లపై అంటే లాట్‌పై లిస్టింగ్‌తోనే రూ. 5090 లాభం అందుకున్నారు. జీఎంపీ అంచనాలకు తగ్గట్లుగానే..ఈ ఐపీఓకు మొదటి నుంచే గ్రే మార్కెట్లో మంచి ప్రీమియం కనిపించింది. లిస్టింగ్‌కు ముందు కూడా జీఎంపీ ఒక్కో షేరుకు రూ. 49.50 వరకు ఉండగా ఆ అంచనాలకు తగ్గట్లుగానే లిస్టింగ్ అయిందని చెప్పొచ్చు. లిస్టింగ్ తర్వాత ఇంకాస్త పెరిగి ఇంట్రాడేలో రూ. 192 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మరోవైపు బీఎస్ఈలో ఈ రాంభాజో ఐపీఓ రూ. 187 వద్ద ఓపెన్ అయి ఇంట్రాడేలో రూ. 190 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 200 రెట్లకుపైగా సబ్‌స్క్రిప్షన్ఈ ఐపీఓ సరైన సమయంలో రావడంతో ఇన్వెస్టర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కావడం విశేషం. మొత్తం 83,79,300 షేర్లు అందుబాటులో ఉంటే 1,78,16,51,400 ఈక్విటీ షేర్ల కోసం ఇన్వెస్టర్లు పోటీపడ్డారు. అత్యధికంగా నాన్ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ వచ్చింది. రిటైల్ కేటగిరీలో 95.30 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇక ఈ ఐపీఐ ద్వారా కంపెనీ రూ. 165.16 కోట్ల మేర నిధుల్ని సమీకరించింది. లిస్టింగ్‌లోనే మంచి లాభాలు వచ్చాయి కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకునేందుకు మంచి ఆప్షన్‌గా ఉంది. ఇక దీర్ఘకాలికంగా ఉంచాలనుకునే వారు ఆర్థిక నిపుణుల సలహాల మేరకు కొనసాగించడం మంచిదని తెలుస్తోంది. Disclaimer: పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి వీటిల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు స్వీకరించడం మంచిది. పైన ఇచ్చింది సమాచారంగానే పరిగణించాల్సి ఉంటుంది. పెట్టుబడులకు సిఫార్సు ఏ మాత్రం కాదు.