క్యాష్ డిపాజిట్, UPI, నెఫ్ట్.. ఏ లావాదేవీకి ట్యాక్స్ నోటీసు రావొచ్చు.. దేనికెంత లిమిట్ ఉంటుంది?

Wait 5 sec.

Bank Transactions: మీ బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్ చేసినా లేదా హై వాల్యూ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసినా మీ బ్యాంక్ లావాదేవీలు అన్నీ ఆదాయపు పన్ను విభాగం నిఘాలోనే ఉంటాయి. మీరు నిర్వహించే ట్రాన్సాక్షన్ విలువ, విధానం బట్టి ఐటీ శాఖ స్పందిస్తుంటుంది. ఆయా ట్రాన్సాక్షన్ల వివరాలను బ్యాంకులు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగానికి స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా తెలియజేస్తుంటాయి. అయితే, ఏ ట్రాన్సాక్షన్ చేస్తే ఐటీ నోటీసు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, దాని లిమిట్ ఎంత? అనే వివరాలు కచ్చితంగా తెలిసి ఉండాలి. క్యాష్ డిపాజిట్ Vs ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్స్పెద్ద మొత్తంలో చేసే ప్రతి క్యాష్ ట్రాన్సాక్షన్ ఐటీ శాఖ దృష్టికి వెళ్తుంది. మీరు నగదు డిపాజిట్ చేసినా లేదా ఆన్‌లైన్లో డబ్బు పంపినా పరిమితికి మించి ఉన్నప్పుడు ఐటీ శాఖ నిఘా పెడుతుంది. అయితే, సాధారణంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లతో పోలిస్తే క్యాష్ డిపాజిట్లపైనే ఆదాయపు పన్ను నిఘా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నగదు ఎలా వచ్చింది అని చెప్పేందుకు సరైన ఆధారాలు ఉండవు. డిజిటల్ లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్లు, యూపీఐ వంటి వాటి ద్వారా రికార్డ్ అవుతాయి. పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేస్తే అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనే ప్రశ్న వస్తుంది. అయితే, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లలోనూ పెద్ద మొత్తంలో తరుచుగా చేస్తుంటే లేదా ఆదాయానికి మించి లావాదేవీలు ఉన్నప్పుడు ఐటీ శాఖ రంగంలోకి దిగుతుంది. దేనికి ఎంత లిమిట్? ఆపైన చేసినట్లయితే ఐటీ నోటీసులు రావచ్చు. అలాగే కరెంట్ అకౌంట్ అయితే ఈ పరిమితి రూ.50 లక్షలుగా ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ ట్రాన్సాక్షన్లకు సైతం రూ.10 లక్షల పరిమితి ఉంటుంది. అలాగే ఇతర లావాదేవీలు కేటగిరీని బట్టి లిమిట్ ఉంటుంది. బ్యాంక్ డ్రాఫ్ట్స్, పే ఆర్డర్స్, బ్యాంకర్స్ చెక్కులు లేదా ఆర్‌బీఐ జారీ చేసిన ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రూమెంట్స్ మొత్తం ఒక ఏడాదిలో రూ.10 లక్షలు దాటినా ఐటీ శాఖ తనిఖీ చేస్తుంది. ఒక ట్రాన్సాక్షన్‌లో రూ.2 లక్షలకు మించి గూడ్స్ లేదా సర్వీసెస్ క్యాష్ రిసిప్టులు తీసుకున్నా ఐటీ శాఖ పరిధిలోకి వెళ్తుంది. ఒకటి లేదా ఎక్కువ క్రెడిట్ కార్డుల బిల్లులు రూ.1 లక్ష ఆపైన నగదు రూపంలో చెల్లించినా ఐటీ నోటీసు రావచ్చు. అలాగే నగదు కాకుండా ఇతర రూపంలో చెల్లించినా రూ.10 లక్షలకు మించి ఉంటే నోటీసు వస్తుంది. బాండ్లు, డిబెంచర్లలో రూ.10 లక్షలకు మించి పెట్టుబడి పెడితే నోటీసులు రావచ్చు. ఒక ఏడాదిలో రూ.10 లక్షలకు మించి షేర్లు కొన్నా నోటీసు వస్తుంది. అలాగే రూ.10 లక్షలకు మించి షేర్ బైబ్యాక్‌లో పాల్గొన్నా నోటీసు రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్‌లో రూ.10 లక్షలకు మించి యూనిట్లు కొన్నప్పుడు. ఏదైనా ఇల్లు, భూమి లాంటి స్థిరాస్తిని స్టాంప్ వాల్యూ మించి రూ.30 లక్షలకు పైగా కొన్నప్పుడువిదేశీ కరెన్సీ విక్రయించినప్పుడు రూ.10 లక్షలు దాటితే నోటీసు రావచ్చు.