ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేసిన అభిషేక్.. తొలి టీ20లో భారత్ స్కోరు ఎంతంటే..!

Wait 5 sec.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో భారత జట్టు భారీ స్కోరు చేసింది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బ్యాటర్లు రాణించారు. ఓపెనర్ .. ఇంగ్లాండ్ బౌలర్లను షేక్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు స్కోరు చేసింది.టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. సంజూ శాంసన్.. వరుసగా మూడో మ్యాచులో విఫలమయ్యాడు. ఏడు బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. రనౌట్ అయ్యాడు. 2 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే నిష్క్రమించాడు. దీంతో భారత్.. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ ఈ సమయంలో అభిషేక్ శర్మ అదరగొట్టాడు. తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు.20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ.. మొత్తంగా 24 బంతుల్లో 59 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఇందులో 4 సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులు చేశాడు. చివర్లో శివమ్ దూబె ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 21 బంతుల్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహబూద్ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, సామ్ కర్రన్ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచులో భారత్ ఏకంగా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ప్లేయింగ్ లెవెన్‌లో ఉన్నారు. హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ పేస్ దళాన్ని నడిపించనున్నారు.