: ప్రస్తుత కాలంలో రూపాయి రూపాయి పొదుపు చేసి భవిష్యత్తు కోసం దాచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు యువత భారీగా ఆసక్తి చూయిస్తోంది. అయితే మార్కెట్లోకి కొత్తగా వచ్చే ప్రతి ఇన్వెస్టర్‌ను వేధించే ఏకైక ప్రశ్న- 'సిప్ (క్రమానుగత పెట్టుబడి విధానం) లేదా లంప్‌సమ్ (ఒకేసారి పెట్టుబడి) ఏది సెలక్ట్ చేసుకోవాలి?' అని. ప్రముఖ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ డేటా ప్రకారం 15 ఏళ్ల కాల వ్యవధిలో ఈ రెండింట్లో ఏది ఎక్కువ రాబడి ఇస్తుంది. రెండింటి మధ్య ఉన్న రూ. 25 లక్షల తేడా వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో మనం ఇప్పుడు లెక్కలతో తెలుసుకుందాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సాధారణంగా సగటున చాలా వరకు 12 శాతం రాబడి వస్తుంటుంది. మొత్తం రూ. 9 లక్షల పెట్టుబడి. ఒకటి సిప్ అంటే నెలకు రూ. 5 వేల చొప్పున 15 ఏళ్లకు ఇన్వెస్ట్ చేయడం, మరొకటి ఒకేసారి రూ. 9 లక్షల పెట్టుబడిపై మెచ్యూరిటీకి రిటర్న్స్ దేంట్లో ఎలా వస్తాయో చూద్దాం.ఇక్కడ నెలకు రూ. 5 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి 15 ఏళ్లలో రూ. 9 లక్షల పెట్టుబడిపై 12 శాతం రిటర్న్స్ లెక్కన చూస్తే మొత్తం రూ. 23,79,657 వస్తుంది.అదే లంప్ సమ్ విషయానికి వస్తే ఒకేసారి రూ. 9 లక్షలపై అదే 12 శాతం వార్షిక రాబడిపై 15 ఏళ్లలో రూ. 49,26,209 వస్తుంది. సిప్ కంటే దాదాపు రూ. 25 లక్షలకుపైగా అధిక లాభం వచ్చింది. లంప్‌సమ్‌లో అంత భారీ రాబడి ఎలా వచ్చింది?చాలా మందికి ఇక్కడ డౌట్ ఏంటంటే రెండింట్లోనూ పెట్టిన మొత్తం పెట్టుబడి రూ. 9 లక్షలుగానే ఉంది. మరి లంప్‌సమ్‌లో సిప్ పెట్టుబడితో పోలిస్తే దాదాపు 25 లక్షల రాబడి అదనంగా ఎలా వచ్చింది. దీని వెనుక ఉన్న అసలు కారణం కాంపౌండింగ్ పవర్. అవును లంప్‌సమ్‌లో మీరు పెట్టిన రూ. 9 లక్షలపై మొదటి రోజు నుంచే మొత్తం 15 ఏళ్ల పాటు వడ్డీపై వడ్డీని సంపాదిస్తూ ఉంటుంది. అదే సిప్‌లో చూస్తే మాత్రం మొదటి నెల కేవలం రూ. 5 వేలపైనే వడ్డీ పడుతుంది. చివరి రూ. 9 లక్షల మార్కును చేరేందుకు 15 ఏళ్లు పడుతుంది. అంటే ఇక్కడ మీ పూర్తి డబ్బుకు 15 ఏళ్ల పాటు వడ్డీ పడే అవకాశం సిప్‌లో ఉండదు. అందుకే సిప్ రాబడి రూ. 23 లక్షల దగ్గరే ఆగిపోయింది. మరి సామాన్యుడికి ఏది బెస్ట్?సిప్ ఎప్పుడు ఎంచుకోవాలి? మీ దగ్గర ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు లేనప్పుడుప్రతి నెలా శాలరీ నుంచి క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటు చేసుకోవాలనుకున్నప్పుడుమార్కెట్ ఒడుదొడుకుల గురించి పెద్దగా టెన్షన్ పడకుండా, రూపీ కాస్ట్ యావరేజింగ్ లాభం పొందాలనుకునే వారికి సిప్ బెస్ట్ ఛాయిస్. మరి లంప్‌సమ్ ఎప్పుడు ఎంచుకోవాలి?మీకు బోనస్ రావడం వల్లనో, ఏదైనా ఆస్తి అమ్మడం వల్ల మీ దగ్గర ఒకేసారి పెద్ద మొత్తం డబ్బులు ఉన్నప్పుడు.షేర్ మార్కెట్ భారీగా పడిపోయినప్పుడు తక్కువ ధరకు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వస్తాయి కాబట్టి ఆ టైంలో లంప్ సమ్ పెడితే దీర్ఘకాలంలో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.