ట్రాన్స్‌జెండర్లపై మెలానియా ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అథ్లెట్ల విషయంలో నెట్టింట పోస్ట్!

Wait 5 sec.

అమెరికాలో ట్రాన్స్‌జెండర్లు క్రీడల్లో పాల్గొనడంపై కొద్ది రోజులుగా వివాదం రేగుతోంది. దీనిపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మెలానియా ట్రంప్ స్పందించారు. ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్‌జీబీటీ సమాజ హక్కులకు తాను పూర్తి మద్దతు ఇస్తానని.. అదే సమయంలో మహిళల క్రీడల్లో కూడా న్యాయం జరగాలని పేర్కొన్నారు. మెలానియా ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో "ఎల్‌జీబీటీ హక్కులను గౌరవిస్తాను. కానీ మహిళా అథ్లెట్ల హక్కులు కూడా రక్షించాలి. ఎల్‌జీబీటీ హక్కులను సమర్థిస్తూనే, బాలికల క్రీడల్లో న్యాయమైన పోటీని కూడా కాపాడాలి. ప్రతి ఒక్కర్నీ గౌరవించాలి. ఈ రెండింటినీ సమానంగా చూసుకోవాలి" అని పేర్కొన్నారు. READ MOREఈ విషయంలో అమెరికా సుప్రీం కోర్టు 6 - 3 మెజార్టీతో ఇచ్చిన తీర్పులో రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్‌జెండర్ బాలికలు, మహిళలు స్కూల్ క్రీడల్లో పాల్గొనకుండా నిషేధించే చట్టాలు కొనసాగించొచ్చని స్పష్టం చేసింది. దీంతో అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న నిషేధాలకు చట్టబద్ధత లభించింది. READ MOREఈ తీర్పును రాసిన న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళల క్రీడల్లో పాల్గొనే అర్హతను జెండర్ ఆధారంగా నిర్ణయించ వచ్చని పేర్కొన్నారు. అమెరికా రాజ్యంగం టైటిల్ 9 ప్రకారం మహిళల క్రీడా వ్యవస్థ పూర్తిగా మార్చాలని ఎక్కడా నిర్దేశించలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు పౌర హక్కుల సంస్థ ఈ తీర్పుపై తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. స్నేహితులతో కలిసి క్రీడల్లో పాల్గొనాలి అనుకునే ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఇది తీవ్ర నిరాశ కలిగించే తీర్పు అని పేర్కొంది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెలానియా ట్రంప్ కూడా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఎల్‌జీటీ, ట్రాన్స్‌జెండర్ హక్కులకు తాను పూర్తిగా మద్దతు ఇస్తాను అంటూనే ఆమె మరోవైపు మహిళల క్రీడల్లో కూడా న్యాయం జరగాలని కోరడం విశేషం. మొత్తానికి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ట్రాన్స్‌జెండర్లు మహిళల క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది.