: ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) గ్యాస్ సిలిండర్ ధరల్ని సమీక్షిస్తుంటాయి. ఇందులో భాగంగానే ఇవాళ జులై 1 న కూడా గ్యాస్ వినియోగదారులకు స్వల్ప ఊరట కల్పించింది. హోటల్స్, రెస్టారెంట్లలో వినియోగించే 19 కిలోల కమర్షియల్ (వాణిజ్య) గ్యాస్ సిలిండర్ రేట్లను ఆయిల్ కంపెనీలు భారీగా తగ్గించేశాయి. అయితే ఇళ్లలో వంట గ్యాస్ కోసం వాడే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్ని మార్చలేదు. ఈ రేట్లు యథాతథంగానే ఉన్నాయి. ఇప్పుడు దేశంలోని ప్రముఖ నగరాల్లో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో రూ. 176 తగ్గగా ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌కు రూ. 3191 కి చేరింది. అంతకుముందు జూన్ నెలలో రూ. 52 పెరిగి ఇది రూ. 3367 గా ఉండేది. దానికి ముందు . ఈ క్రమంలోనే రూ. 111, రూ. 49, రూ. 144, రూ. 215.50, రూ. 994 మేర పెరిగాయి. గతేడాది డిసెంబరులో ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర కేవలం రూ.1801.50 గా ఉండగా అక్కడి నుంచి 6 నెలల్లో దాదాపు డబుల్ అయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగ్గా కేంద్రం కూడా గ్యాస్ సిలిండర్ రేట్లను విపరీతంగా పెంచుతూ వచ్చింది. ఇప్పుడు 6 నెలల తర్వాత రేట్లు దిగొచ్చాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండర్ ధరలు చూస్తే న్యూఢిల్లీలో రూ. 183.50 తగ్గి రూ. 2930 కి దిగొచ్చింది. ముంబైలో రూ. 182 తగ్గడంతో రూ. 2885.50 కి చేరింది. చెన్నైలో రూ. 177 తగ్గి రూ. 3106 కు పడిపోయింది. బెంగళూరులో రూ. 177 తగ్గడంతో రూ. 3021 గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రూ. 175.50 తగ్గి ప్రస్తుతం రూ. 3128 వద్ద ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌లోనే గ్యాస్ సిలిండర్ ధరలు అధికంగా ఉన్నాయి. కమర్షియల్ గ్యాస్ రేట్లు తగ్గడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు సహా క్యాటరింగ్ సంస్థలు, టిఫిన్ సెంటర్లు నిర్వహించే చిన్న వ్యాపారుల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో బయట టిఫిన్, మీల్స్ ధరలు తగ్గించే అవకాశాలు ఉంటాయి. మరోవైపు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రూ. 994 వద్దే స్థిరంగా ఉంది. . దానికి ముందు మార్చిలో రూ. 60 చొప్పున పెరిగింది. అంతకుముందు చాలా కాలం రేటు రూ. 905 వద్ద ఉండేది. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర విజయవాడలో రూ. 966.50 గా ఉంది. న్యూఢిల్లీలో రూ. 942, కోల్‌కతాలో రూ. 968, ముంబై, చెన్నైల్లో వరుసగా రూ. 941.50, రూ. 957.50 గా ఉన్నాయి.