దొంగ నోట్ల ఎఫెక్ట్.. రూ.500 నోటుపై RBI మరో కొత్త ప్రకటన.. ఏం చెప్పిందంటే? ​

Wait 5 sec.

RBI Rs 500 Note: మార్కెట్లో నకిలీ నోట్ల చలామణి పెరిగిపోతోంది. ముఖ్యంగా రూ.500 వంటి పెద్ద నోట్లు ఎక్కువగా నకిలీవి చలామణి అవుతున్నాయి. దీంతో ఏదో ఒక సందర్భంగా సాధారణ ప్రజలు నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటి దొంగ నోట్ల చెలామణిని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. కరెన్సీ నోట్లపై అందులో సామాన్య ప్రజలకు అంతగా తెలియని, అత్యంత కీలకమైన ఫీచర్ ఒకటి కొత్తగా తీసుకొచ్చింది. అదే మైక్రో లెటరింగ్ (Micro Lettering). ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. రూ.500 నోటు మైక్రో లెటరింగ్ ఏంటి?నిత్యం ఎన్నో అవసరాలకు మనం కరెన్సీ నోట్లను ఉపయోగిస్తుంటాం. కానీ, దానిని అంతగా పరిశీలించం. రూ.500 నంబర్, మహాత్మా గాంధీ చిత్ర, భాషలు, వివిధ పెద్ద చిత్రాలు, సిరీస్ నంబర్ వంటివి పైకి సులభంగా కనిపిస్తుంటాయి. కానీ, సాధారణ కంటితో చూస్తే కేవలం గీతల్లా, డిజాన్ మాదిరిగా కనిపించే కొన్ని చోట్ల భూతద్దం పెట్టి చూస్తే అతి చిన్న అక్షరాలు కనిపిస్తాయి. దీనినే మైక్రో లెటరింగ్ అంటారు. దొంగ నోట్లను ముద్రించే ముఠాలు ఈ టెక్నాలజీని కాపీ కొట్టడం అంత సులభం కాదని ఆర్‌బీఐ సూచిస్తోంది. 'నకిలీ నోట్ల ఆందోళనలు పెరిగిన సమయంలో మీరు చిన్న వివరాలతో అసలు నోటును ఈజీగా కనుక్కోవచ్చు. అలాంటి రూ.500 నోటుపై ఉండే ఒక సెక్యూరిటీ ఫీచర్ మైక్రో లెటరింగ్ గురించి ఇప్పుడే తెలుసుకోండి.' అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది. రూ.500 నోటుపై భారత్ అని హిందీలో ఇండియా (INDIA) అని ఆంగ్లంలో మహాత్మాగాంధీ శాలువ మడతలో మైక్రో లెటర్స్ కనిపిస్తాయి. అలాగే మహాత్మా గాంధీ కంటి అద్దాల ఫ్రేమ్‌లో RBIఅని మైక్రో లెటర్స్ కనిపిస్తాయి. బ్యాంక్ నోట్ ఎడమ వైపు RBI500INDIA అనే మైక్రో లెటర్లు కనిపిస్తాయి. వీటిని భూతద్దంతో చూడాల్సి ఉంటుంది.అక్కడ అక్షరాలకు బదులు కేవలం నల్లటి మచ్చలు లేదా లైన్లు పడతాయి. అదే అసలైన నోటు అయితే భూతద్దంలో చూసినప్పుడు RBI, భారత్, ఇండియా అనే అక్షరాలు అత్యంత స్పష్టంగా కనిపిస్తాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. రూ.500 నోటు తీసుకునేటప్పుడు కేవలం గాంధీ చిత్రం, గ్రీన్ లైన్ మాత్రమే కాకుండా ఇలాంటి మైక్రో లెటరింగ్ సెక్యూరిటీ ఫీచర్లను సైతం గమనించాలని, దీంతో నకిలీ నోట్ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చని తెలిపింది.