పీవీ సునీల్ కుమార్‌కు షాకిచ్చిన క్యాట్.. పిటిషన్ కొట్టివేత..

Wait 5 sec.

కు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌(CAT)లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ కొట్టివేసింది. పీవీ సునీల్ కుమార్ జూన్ 30వ తేదీ పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయనపై ఉన్న కేసులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో చేసిన సంగతి తెలిసిందే. పదవీ విరమణకు వీలుగా సోమవారం రోజునచేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే సస్పెన్షన్‌ కాలంలోనే రిటైర్మెంట్ కానుండటంతో ఆయనకు రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో వచ్చే అవకాశాలు లేవు. పీవీ సునీల్ కుమార్ మీద ఉన్న ఆరోపణలపై కోర్టులు వెల్లడించే తీర్పులకు అనుగుణంగా, కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆధారపడి ఉంటాయని సోమవారం జారీ చేసిన రిలీవ్ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన మీద పెండింగ్‌లో ఉన్న విచారణలలో ఎలాంటి మినహాయింపులు లేవని, యధావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పీవీ సునీల్ కుమార్‌కు లభించాల్సిన పెన్షన్‌ ప్రయోజనాలు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా ఉంటాయని ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రోజైన తనకు సస్పె్న్షన్ నుంచి రిలీవ్ ఇవ్వమని కోరుతూ పీవీ సునీల్‌ కుమార్‌ క్యాట్‌లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం ఉదయం విచారించిన క్యాట్.. ఆయన అభ్యర్తనను తోసిపుచ్చింది. పిటిషన్ కొట్టి వేసింది. దీంతో వరకూ సస్పెన్షన్‌లోనే కొనసాగనున్నారు. సస్పెన్షన్ కాలంలోనే రిటైర్ కానున్నారు. పీవీ సునీల్ కుమార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపేయండి.. భార్య విజ్ఞప్తిమరోవైపు పీవీ సునీల్ కుమార్‌‍కు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపేయాలని ఆయన సతీమణి అరుణ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. విభేదాల కారణంగా అరుణ, పీవీ సునీల్‌ కుమార్ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే 2017 జూన్‌లో పీవీ సునీల్ కుమార్ మీద అరుణ గృహ హింస, వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టారు. పీవీ సునీల్ కుమార్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిపివేయాలంటూ ఆమె ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు.