ట్రంప్ విధానాలతో 30 ఏళ్ల అధమస్థాయికి అమెరికా-భారత్ సంబంధాలు.. రో ఖన్నా సంచలన ఆరోపణలు

Wait 5 sec.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన విధ్వంసకర విధానాలతో అమెరికా- భారత్ సంబంధాలు అత్యంత అధమస్థాయికి పడిపోయాయని ఆయన ఆరోపించారు. వాషింగ్టన్‌ వేదికగా జరిగిన అమెరికా ఇండియ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో రో ఖన్నా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు అయిన రో ఖన్నా.. 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతోన్న ఆశావాహుల్లో ఒకరు. వైఖరి, ఇతర విదేశాంగ విధాన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, భారత్‌తో సంబంధాలను ప్రభావితం చేసిందని ఆయన మండిపడ్డారు. దీంతో ప్రభుత్వ వలస, విద్యార్థి వీసా విధానాలు ప్రపంచ ప్రతిభను ఆకర్షించే అమెరికా సామర్థ్యాన్ని బలహీనపరుస్తున్నాయని ఖన్నా విమర్శించారు.‘‘గత 30 ఏళ్లలో అమెరికా-భారత్ సంబంధాలు అత్యంత దిగువస్థాయికి పడిపోయాయి.. ఇరాన్‌తో యుద్ధ వాతావరణానని సృష్టించిన ట్రంప్ విధానాలు తీవ్ర వినాశనానికి దారితీశాయి... అవి భారత్‌లో ఇంధన ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.. మీరు నా మాటమీద నమ్మకం లేకపోతే భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌ను అడగండి...’’ అని అన్నారు.ఇటీవల తన చైనా పర్యటన గురించి ప్రస్తావిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్ విధానాల దీర్ఘకాలిక ప్రభావం గురించి ఒక భారతీయ దౌత్యవేత్త ఆందోళన వ్యక్తం చేశారని ఖన్నా పేర్కొన్నారు. ‘‘నేను చైనాలో ఉన్నప్పుడు, అధ్యక్షుడు ట్రంప్ వల్ల ఒక తరం నమ్మకం పోయిందని అక్కడి భారత రాయబారి నాతో చెప్పారు.’’ అని తెలిపారు. ‘‘ఈ అధ్యక్షుడు చేసిన నష్టాన్ని మనం అంగీకరించకపోతే.. మనం వాస్తవంలో జీవించనట్లు కాదు’’ అని ఖన్నా అన్నారు.అమెరికా సంప్రదాయబద్దంగా కొనసాగిస్తూ వస్తున్న ప్రపంచ నాయకత్వాన్ని విడిచిపెట్టారని, విలువల ఆధారిత విలువలకు బదులుగా బలప్రయోగంతో నడిచే విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘ఇప్పుడు అమెరికా నైతిక దార్శినికతను మరచిపోయింది.., 'బలమే హక్కు' అనే విదేశాంగ విధానాన్ని అవలంబిస్తోంది. ఇరాన్‌నే కాదు, క్యూబాను, గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకుంటామని బెదిరిస్తోంది. ఇంత జరుగుతున్నా ఇవన్నీ తెలియనట్టు మనం కూర్చుని డిన్నర్లు చేసుకుంటున్నాం’’ అని ఖన్నా అన్నారు.‘ఈ అధ్యక్షుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాయకత్వాన్ని నాశనం చేస్తుంటే.. ఇక వ్యూహాత్మక భాగస్వామ్యాల గురించి ఎవరు పట్టించుకుంటారు?’’ అని రో ఖన్నా నిలదీశారు. వలసదారులు, అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో ట్రంప్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఇది అమెరికా ఆవిష్కరణల రంగాన్ని దెబ్బతీస్తుందని మండిపడ్డారు.‘‘వలసదారుల, అమెరికాలోకి వచ్చేవారి కొరతపై ఈ ప్రెసిడెంట్ చేస్తున్న ప్రసంగాలు అనాగరికంగా ఉన్నాయి. విద్యార్థి వీసాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను, అమెరికాకు వచ్చే ప్రతిభను భూతద్దంలో చూపిస్తూ చేస్తున్న ప్రచారాన్ని మనం ఖండించకుండా ఎలా ఉండగలం? ఏఐ రంగంలో ప్రపంచాన్ని నడిపించాలని చూస్తున్న ఈ అధ్యక్షుడికిప్రతిభను ఆకర్షించాలనే కనీస అవగాహన లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ ఏఐ పరిశోధకులలో 38 శాతం మంది చైనా మూలాలు ఉన్నవారే, అలాగే 72 శాతం మంది విదేశీ డిగ్రీలు ఉన్నవారే. అలాంటి ప్రతిభను మనం దూరం చేసుకుంటున్నాం’’ అని ఖన్నా ఆవేదన వ్యక్తం చేశారు.