స్వీడన్ బిలియనీర్ అహంకారాన్ని దెబ్బకొట్టిన 'శివకాశి' సామాన్యుడు.. మన 'అగ్గిపెట్టె' వెనుక ఇంత కథ ఉందా?

Wait 5 sec.

: ఈ రోజు మన ఇంట్లో వెలిగే ఒక చిన్న అగ్గిపెట్టె వెనుక అద్భుతమైన స్వాతంత్య్ర సమర చరిత్ర ఉందంటే నమ్ముతారా? 1922 కాలంలో భారతదేశంలో ప్రతి అగ్గిపుల్ల కూడా విదేశాల నుంచే వచ్చేది. 'భారతీయులకు కెమికల్స్ వాడటం రాదు. వాళ్లు కేవలం కొనుగోలుదారులు మాత్రమే' అంటూ స్వీడన్‌కు చెందిన 'మ్యాచ్ కింగ్', బిలియనీర్ ఐవర్ క్రూగర్ ప్రపంచ మార్కెట్‌ను శాసించేవారు. అలాంటి తరుణంలో కరవుతో అల్లాడుతున్న తమిళనాడులోని శివకాశి అనే చిన్న గ్రామం నుంచి ఒక సామాన్యులు ముందుకొచ్చాడు. ఆయనే పి. . స్వీడన్ మోనోపాలిని ఆయన ఎలా బద్దలు కొట్టారో తెలుసుకుందాం. శివకాశి అనే కరవు గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆయనను గుర్తిస్తారు. 1900 ల ప్రారంభంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా అగ్గిపెట్టెలు వినియోగించే దేశాల్లో ఒకటి. కానీ వాటి తయారీపై మాత్రం స్వీడన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఐవర్ క్రూగర్ ఆధిపత్యం సాగేది. WIMCO వంటి విదేశీ సంస్థలు భారత మార్కెట్‌ను పూర్తిగా తమ అధీనంలో ఉంచుకొని భారీ లాభాలు ఆర్జించేవి. ఆ సమయంలోనే భారతీయులు అధునాతన పరిశ్రమలు నడపలేరని, ప్రమాదకర రసాయనాలతో పనిచేయలేరని విదేశీ సంస్థలు ప్రచారం చేసేవి.దీంతో కరవుతో పంటల్లేక, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తన స్వగ్రామం శివకాశిని చూసిన అయ్య నాడార్ ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. పరిశ్రమ కోసం రుణాలు అడిగితే చాలా మంది తిరస్కరించారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. తన భాగస్వామితో కోల్‌కతాకు వెళ్లిన అయ్య నాడార్ అక్కడి మ్యాచ్ పరిశ్రమల్ని పరిశీలించారు. అక్కడి సాంకేతికతల గురించి రహస్యంగా తెలుసుకున్నారు. శత్రువు గుడారంలోకి వెళ్లి రహస్యాలు దొంగిలించి..అయ్య నాడార్ భారీ విదేశీ యంత్రాల జోలికి వెళ్లలేదు.కోల్‌కతాలోని అత్యంత రహస్య మ్యాచ్ ఫ్యాక్టరీలోకి సాధారణ లేబర్‌గా ముసుగు వేసుకొని వెళ్లారు.కెమికల్ నిష్పత్తులు, కర్ర కటింగ్ టెక్నిక్స్ అన్నీ పశీలించి, ఒక చేత్తో రాసిన హ్యాండ్ మేడ్ బ్లూప్రింట్‌తో (తయారు చేసే విధానం రూపొందించుకున్నాడు) శివకాశి నుంచి తిరిగొచ్చారు.గ్రామస్తులకు ఆయన ఇచ్చిన సందేశం ఒక్కటే. 'డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. మీ చేతి పని ఇవ్వండి.' అని అడిగారు. గ్రామ ప్రజలు చిన్న చిన్న వర్క్ షాప్స్ ఏర్పాటు చేసి చేతితో మ్యాచ్‌లు తయారు చేయడం ప్రారంభించారు.అయ్య నాడార్ వేసిన మాస్టర్ ప్లాన్విదేశీ బ్రాండ్‌కు కోట్ల రూపాయల మార్కెటింగ్ బడ్జెట్ ఉంది. దాన్ని తట్టుకునేందుకు నాడార్ ఒక అద్భుతమైన ట్రిక్ వాడారు. అగ్గిపెట్టెలపై భారత స్వాతంత్య్ర వీరులు, జాతీయ చిహ్నాలు, స్థానిక దేవతల బొమ్మలు ముద్రించారు.దీంతో భారతీయులకు ఆ అగ్గిపెట్టె కొనడం ఒక దేశభక్తిగా మారింది. ప్రజల్లో స్వదేశీ భావన పెరిగి.. విదేశీ కంపెనీల అమ్మకాలు పడిపోయాయి.ఇక శివకాశి కూడా భారీగా అభివృద్ధి చెందింది. చిన్న కుటీర పరిశ్రమే భారీ ఇండస్ట్రీగా మారిపోయింది. తర్వాత అదే శివకాశిలో బాణసంచా పరిశ్రమ, ప్రింటింగ్ పరిశ్రమ, సేఫ్టీ మ్యాచ్ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందాయి. ప్రస్తుతం దేశంలో ఉపయోగించే సేఫ్టీ మ్యాచ్‌లు, బాణ సంచాలో దాదాపు 90 శాతం వరకు శివకాశిలోనే తయారవుతున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా లక్షలాది గ్రామీణ కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. పరిశ్రమలు నిర్మించాలంటే విదేశీ యంత్రాలు మాత్రమే అవసరం లేదని, స్థానిక నైపుణ్యం, పట్టుదల, శ్రమ ఉంటే ప్రపంచ స్థాయి పరిశ్రమల్ని కూడా నిర్మించవచ్చని అయ్య నాడార్ నిరూపించారు. శివకాశి చరిత్ర కేవలం మ్యాచ్ పరిశ్రమ కథ కాదు. భారత స్వావలంబనకు, గ్రామీణ పారిశ్రామిక విప్లవానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే నేడు మనం వెలిగించే ప్రతి శివకాశి అగ్గిపెట్టె వెనుక ఒక సామాన్య భారతీయుడి ఆత్మగౌరవ పోరాట చరిత్ర దాగి ఉంది.