బంగారం ధరల్లో భారీ మార్పు- వరుసగా తగ్గి ఒక్కసారిగా ఇలా- తులం గోల్డ్ రేటు ఇప్పుడు ఎంతంటే?

Wait 5 sec.

Today: భారతదేశంలో బంగారానికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారత్- చైనాతో కలిసి ముందు వరుసలో ఉంటుంది. ఇంకా ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. మన దగ్గర పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాల సమయంలో పసిడికి డిమాండ్ ఊహించని రీతిలో ఉంటుంది. మహిళలు బంగారు ఆభరణాల్ని ఈ సమయంలో కొనుగోలు చేసి ధరించాలని చూస్తుంటారు. ఇది వారి అందాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. అంతలా బంగారం అనేది భారతీయుల సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయింది. బంగారంతో పాటుగా వెండికి కూడా ఇదే రీతిలో డిమాండ్ ఉంటుంది. గతేడాది రికార్డు స్థాయిలో పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. ఈ ఏడాదిలో కాస్త తగ్గుతున్నాయి. ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిన క్రమంలో అటు డిమాండ్ పెరిగి తగ్గుతూ వచ్చాయి. మళ్లీ అమెరికా- ఇరాన్ తాత్కాలిక ఒప్పందంతో క్రూడాయిల్ ధరలు తగ్గగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ వెళ్లాయి. . అయితే సడెన్‌గా మళ్లీ ఈ ధరల తగ్గింపునకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో, అదే విధంగా దేశీయంగా కూడా పసిడి ధర పెరగ్గా వెండి స్థిరంగా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు కిందటి రోజు 4050 డాలర్ల స్థాయిలో ఉండగా ఇప్పుడు అది 4120 డాలర్ల మార్కు వద్ద ఉంది. సిల్వర్ రేటు చూస్తే 60 డాలర్ల మార్కును అధిగమించింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం రూ. 95.59 వద్ద ఉంది. ఇదీ చూడండి: దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లను గమనిస్తే హైదరాబాద్ నగరంలో మళ్లీ రేట్లు పెరిగాయి. 22 క్యారెట్ల పుత్తడి ధర జులై 10న ఉదయం 8 గంటల సమయంలో రూ. 1200 పెరిగి 10 గ్రాములకు రూ. 1,32,400 వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా రూ. 1950, రూ. 1250, రూ. 100 మేర తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే ఒక్కరోజులో రూ. 1310 పెరగడంతో తులం రూ. 1,44,440 కి చేరింది. ఇది అంతకుముందు వరుసగా రూ. 2130, రూ. 1360, రూ. 110 మేర తగ్గుతూ వచ్చింది. ఇక మారకుండా స్థిరంగానే ఉంది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 2.45 లక్షల వద్ద ఉంది.