తిరుపతి వెళ్దామని రైల్వే స్టేషన్‌కు.. రైలు లేకపోవడంతో.. ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన మందుబాబు..!

Wait 5 sec.

జనగామ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ అద్దె బస్సును ఓ వ్యక్తి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. పాలకూర్తికి చెందిన వెంకన్న అనే వ్యక్తి బస్సును స్టార్ట్ చేసి సూర్యపేట వైపు మళ్లించాడు. అలా 21 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సింగరాజుపల్లి టోల్ గేట్ వద్ద అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. దీంతో బస్సు ఆగిపోయింది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు అతణ్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని చెబుతున్నారు.నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న అనంతరం పోలీసులు ప్రశ్నించగా అసలేం జరిగిందో చెప్పుకొచ్చాడు. తన పేరు వెంకన్న అని, ఊళ్లో ట్రాక్టర్ నడుపుతానని చెప్పాడు. ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుండటంతో.. తిరుపతి వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్తే.. ట్రైన్ లేదని చెప్పి రెండుసార్లు వెళ్లగొట్టారని.. దీంతో బస్టాండ్‌కు వచ్చానని చెప్పాడు. బస్టాండ్‌లో పక్కకు ఆపిన బస్సు కనిపించడంతో ఎక్కి నిద్ర పోదామని అనుకున్నానని.. డ్రైవర్ సీట్లో కూర్చోగానే తాళం చేతులు కనిపించాయని.. దీంతో ప్రాక్టీస్ కోసం బస్టాండ్ చుట్టూ రెండు రౌండ్లు వేసినట్లు చెప్పాడు. ఆర్టీసీ అధికారి ఒకరు బస్సు ఆపి.. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగితే.. పాలకూర్తి సార్ అంటే పోమని చెప్పాడని.. ఇందులో తన తప్పేమీ లేదన్నాడు.గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. . ఎంత సేపటికీ బస్సు రాకపోవడంతో.. పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ అత్త గారి ఊరికి వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ అతడే బస్సును పోలీసు స్టేషన్లో అప్పగించాడు.గత ఏడాది మే నెలలో . బస్సు పోయిందని పోలీసులకు ఫిర్యాదు అందడంతో వెతుకుతుండగా.. కడప జిల్లా చింతకొమ్మదిన్నె ఘాట్ రోడ్డులో గుర్తించారు. ఘాట్ రోడ్డులో మలుపు తిప్పే క్రమంలో ప్రమాదం జరగడంతో.. బస్సును అక్కడే వదిలేసి వెళ్లారు. అంతకు ముందు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ బస్సును నాయుడుపేట వద్ద పోలీసులు గుర్తించడంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.