100కు 100.. 1000కి 1000.. ఎన్ని షేర్లు కొంటే అన్ని ఫ్రీ.. బోనస్ ఇస్తోన్న FMCG కంపెనీ

Wait 5 sec.

Bonus Shares: స్మాల్ క్యాప్ కేటగిరిలోని ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెక్టార్ కంపెనీ మయాంక్ క్యాటిల్ ఫుడ్ లిమిటెడ్ (Mayank Cattle Food Limited) బంపర్ ఆఫర్ తెచ్చింది. తన షేర్ హోల్డర్లకు గుడ్ న్యూస్ చేప్పింది. జులై 7వ తేదీన జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో ఈ బోనస్ ఇష్యూ ప్రకారం 1 షేరు కొంటే మరొక షేరు ఉచితంగా వస్తుంది. 100 కొంటే మరో 100, 1000 షేర్లు కొంటే మరో వెయ్యి షేర్లు బోనస్ రూపంలో లభిస్తాయి. ఈ బోనస్ ఇష్యూలో ఉచిత షేర్లు పొందేందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ స్టాక్ గత 6 నెలల్లోనే 40 శాతం వరకు రాబడులు ఇచ్చింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. జులై 7వ తేదీన జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 1:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేయలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీని అర్థం రికార్డు డేట్ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరు కొనుగోలు చేసి తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నవారికి అదనంగా రూ.10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని బోనస్ రూపంలో ఉచితంగా ఇస్తారు. ఈ బోనస్ షేర్లను పొందడానికి అర్హులైన షేర్ హోల్డర్లను గుర్తించే రికార్డు డేట్ త్వరలోనే నిర్ణయించనున్నట్లు కంపెనీ తెలిపింది. చివరి ట్రేడింగ్ సెషన్లో మయాంక్ క్యాటిల్ ఫుడ్ షేరు 0.14 శాతం నష్టంతో రూ. 218.90 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 235.80 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 144.25 వద్ద ఉన్నాయి. త నెల రోజుల్లో 9 శాతం లాభపడింది. గత ఆరు నెలల్లో 40 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఏడాది కాలంలో 3 శాతం నష్టపోయింది. గత రెండున్నర ఏళ్ల కాలంలో 91 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.123 కోట్లుగా ఉంది. Disclaimer: ఈ కథనం ఇన్వెస్టర్లకు సమాచారం ఇవ్వడానికే తప్పితే ఎలాంటి పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించేందుకు కాదు. స్టాక్ మార్కెట్లో రిస్క్ హైగా ఉంటుంది. ఎంచుకున్న స్టాక్ గురించి తెలియకుండా డబ్బులు పెడితే పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.