భారత్‌లో పెరుగుతోన్న 'పర్మనెంట్ EMI జనరేషన్'.. అప్పుల లైఫ్ స్టైల్‌కి అసలు కారణాలివే..!

Wait 5 sec.

EMI Generation: 'ఇప్పుడు కొనండి.. నెమ్మదిగా విడదల వారీగా చెల్లించండి'.. నేటి తరం యువతను విపరీతంగా ఆకర్షిస్తోన్న స్లోగన్ ఇది. భారతీయ సమాజంలో ఒకప్పుడు అప్పులు చేసేందుకు భయపడేవారు, అవమానంగా భావించేవారు. కానీ నేడు కాలం పూర్తిగా మారిపోయింది.ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్లు అంటూ చాలా రకాల ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రతి నెలా వచ్చే జీతంలో సగం కంటే ఎక్కువ భాగం ఈ ఈఎంఐల కోసమే వెచ్చిస్తున్నారు. ఈ విధంగ దేశంలో ఒక కొత్త పర్మనెంట్ జనరేషన్ (Permanent EMI Generation) వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు అప్పు లేదా ఈఎంఐ అనేది కేవలం సొంత ఇల్లు లేదా కారు వంటి పెద్ద పెద్ద అవసరాలకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, బట్టలు, ఆఖరకు పబ్బులు, వెకేషన్లకు సైతం అప్పులు చేస్తున్నారు. అప్పు అనేది ఒక జీవన విధానంగా ఎలా మారిపోయిందో ఈ అంశాలే నిదర్శనంగా మారాయి. ఈఎంఐల ఊబిలో భరతీయ యువత తమ జీవితాన్ని గడిపేస్తున్నారు. అదే తమ లైఫ్ స్టైల్ అని అనుకుంటున్నారు. కానీ, ఆ ఆలోచనే ప్రమాదకరమని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పు ఒక జీవన విధానంగా ఎలా మారింది?గతంలో బ్యాంకు చుట్టూ తిరిగితే కానీ లోన్ ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లో మొబైల్ యాప్స్ ద్వారా వేల రూపాయల రుణాలు ఇస్తున్నారు. ఫిన్‌టెక్ యాప్స్ ద్వారా ఈ సదుపాయాలు అరచేతిలోకి వచ్చేశాయి. బ్యాంకులు పిలిచి మరీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. చేతిలో రూపాయి లేకపోయిన క్రెడిట్ కార్డుల ద్వారా ఏదైనా కొనుగోలు చేసే అవకాశం లభించడంతో విచ్చలవిడిగా అప్పులు చేసేస్తున్నారు. షో ఆఫ్ సంస్కృతి పెరుగుతోంది. సోషల్ మీడియా ప్రభావంతో ఇతరుల కంటే తామేం తక్కువ కాదు అని నిరూపించుకునేందుకు యువత ఖరీదైన ఫోన్లు, బ్రాండెడ్ బట్టలు, విదేశీ ప్రయాణాలను ఈఎంఐలపై ఎగబడి కొంటున్నరాు. వెనుక ఉన్న ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్టీ, హిడెన్ ఛార్జీలను గమనిచండం లేదు. తాము ఎలాంటి అదనపు వడ్డీ చెల్లించడం లేదనే భ్రమలో ఎక్కువ వస్తువులు కొంటున్నారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే సాంప్రదాయ ఆలోచనా విధానానికి భిన్నంగా ఈరోజు సంపాదించు ఈరోజే ఖర్చు పెట్టు అనే ధోరణి పెరగడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో కూడా మళ్లీ అప్పుల పైనే ఆధారపడాల్సి వస్తోంది. నెలవారీ ఈఎంఐల మొత్తం నికర జీతంలో 20-30 శాతం కంటే ఎక్కువ ఉండకూడదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించకపోతే ఈ ఈఎంఐల చక్రబంధం నుంచి బయటపడడం చాలా కష్టమవుతుందని చెబుతున్నారు. తమ ఆర్థిక స్తోమతకు తగినట్లుగా జీవన శైలి అలవాటు చేసుకోవాలని, గొప్పలకు పోయి అప్పుల ఊబిలో కూరుకుపోవద్దని సూచిస్తున్నారు.