రాధా గాయత్రి కేసులో అనూహ్య పరిణామం.. ఇకనైనా చిక్కుముడులు వీడుతాయా?

Wait 5 sec.

విశాఖపట్నానికి చెందిన లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధా గాయత్రి భర్త శ్రీచరణ్‌ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ జేసీ పంత్‌ నేతృత్వంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాకు చెందిన రాధా గాయత్రి ఉత్తరాఖండ్‌లోని ముసోరిలో జూన్ 14వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. భర్త శ్రీచరణ్‌తో కలిసి విహార యాత్రకు వెళ్లిన రాధా గాయత్రి.. అనూహ్య రీతిలో స్టే హోమ్‌లో విగతజీవిగా కనిపించారు. అయితే రాధా గాయత్రి మరణానికి ఆమె భర్త శ్రీచరణ్ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలంటూ రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్‌, సత్యవతి డెహ్రాడూన్‌లో న్యాయపోరాటం చేస్తున్నారు. రాధా గాయత్రిని.. తమ అల్లుడు శ్రీచరణే హత్య చేశాడంటూ ఆమె తండ్రి సుధాకర్‌ ఆరోపిస్తున్నారు. రాధా గాయత్రి తల్లిదండ్రులు లేకుండానే పోస్టుమార్టం పూర్తి చేసిన నేపథ్యంలో.. పోస్టుమారం రిపోర్టుపై మెజిస్టీరియల్ విచారణకు జోక్యం చేసుకోవాలని రాధా గాయత్రి తల్లిదండ్రులు సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కర్నల్‌ వీరేంద్ర ప్రసాద్ భట్‌ను కోరారు. దీంకు డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆయన ఆదేశాలతో ముసోరి డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ రాహుల్‌ ఆనంద్‌.. రాధా గాయత్రి కేసు విచారణ ప్రారంభించారు. జూన్ 14, 15, 16వ తేదీలలో అసలు ఏం జరిగిందనేదీ తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే విచారణకు రావాలని ఆదేశించారు. జులై 17న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈలోపే శ్రీచరణ్ ఆచూకీ తెలియడంతో పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జూన్ 14 నుంచి జూన్ 16వ తేదీల మధ్య అసలు ఏం జరిగింది.. ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారనే దానిపై ఆరా తీయనున్నారు. అలాగే రాధా గాయత్రి తల్లిదండ్రులు లేకుండా పోస్టుమార్టం ఎందుకు చేశారన్న అంశంపై విచారించనున్నట్లు తెలిసింది.ఈ కేసులో రాధా గాయత్రిని పోస్టుమార్టం చేసిన సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు శ్రీచరణ్ ప్లాన్ ప్రకారం రాధా గాయత్రి అడ్డు తొలగించుకున్నాడని సుధాకర్ ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.