పీఎఫ్ ఖాతాలో వడ్డీ పడుతోంది? మీ అకౌంట్లో పడిందా? ఒక్క మిస్డ్ కాల్‌తో క్షణాల్లో తెలుసుకోవచ్చు!

Wait 5 sec.

: కోట్లాది మంది వేతన జీవులకు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎఫ్ వడ్డీ డబ్బుల్ని ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ల అకౌంట్లలో జమ చేయడం ప్రారంభించింది. అయితే ప్రస్తుతం వడ్డీ జమ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతున్నందున, కొందరి పాస్‌బుక్‌లలో మాత్రం ఈ మొత్తం వెంటనే కనిపించకపోవచ్చు. దీంతో కంగారు పడాల్సిన పని లేదని, చేసింది. మీ మొబైల్ నంబర్ మీ యూఏఎన్‌కి లింక్ అయి ఉంటే కొన్ని సులువైన పద్ధతుల ద్వారా మీ అప్డేటెడ్ వడ్డీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అసుల ఇప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఇంటర్నెట్ లేదా స్మార్ట్‌ఫోన్ లేకపోయినా మీ యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే క్షణాల్లో పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మీ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. ఈ నంబర్‌కు డయల్ చేయగానే రెండు రింగుల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. తర్వాత మెసేజ్ రూపంలో టోటల్ పీఎఫ్ బ్యాలెన్స్, చివరి కాంట్రిబ్యూషన్ వివరాలతో కూడిన మెసేజ్ మీకు అందుతుంది. కాబట్టి ప్రతి నెలా ఎంత పీఎఫ్ కట్ అవుతుందో తెలుసు కాబట్టి పీఎఫ్ బ్యాలెన్స్ మధ్య తేడా గమనించడం ద్వారా మీకు ఎంత వడ్డీ పడిందనేది కూడా తెలుసుకోవచ్చు. పోర్టల్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లో యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌తో లాగిన్ చేయాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అక్కడ పీఎఫ్ పోర్టల్‌లో వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే మీ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత వడ్డీ జమైందో తెలుస్తుంది.Read Also: ఉమంగ్ యాప్‌లో లాగిన్ అయి కూడా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాల్ని తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో లాగిన్ అయి యూఏఎన్ నంబర్‌ను లింక్ చేయాలి. పీఎఫ్ బ్యాలెన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే గత 3 నెలల లావాదేవీలతో పాటు పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇదే సమయంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 కు మెసేజ్ చేయాలి. తెలుగులో సమాచారం కోసం EPFOHO UAN TEL అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. ఇక్కడ UAN దగ్గర మీ యూఏఎన్ నంబర్ ఎంటర్ చేయాలి.