: స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏ స్టాక్ ఎలా దూసుకెళ్తుందో ముందుగానే ఊహించడం కష్టం. గత 3 నెలలుగా సెన్సెక్స్, నిఫ్టీ పెద్దగా పెరగలేదన్న సంగతి తెలిసిందే. అమెరికా- ఇరాన్ భీకర దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అయితే మార్కెట్ పరిస్థితి బాగోలేకపోయినా కొన్ని స్టాక్స్ మాత్రం అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందించాయి. మార్కెట్ ట్రెండ్‌కు భిన్నంగా రాణించడం విశేషం. బీఎస్ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ గత 3 నెలల వ్యవధిలో చూస్తే కేవలం 0.14 శాతమే పెరిగింది. అయినా కొన్ని స్టాక్స్ మల్టీబ్యాగర్ రాబడుల్ని అందించాయి. కనీసం రూ. 5000 కోట్ల మార్కెట్ వాల్యుయేషన్ ఉన్న బలమైన కంపెనీలను ఫిల్టర్ చేస్తే.. కేవలం 3 నెలల కాలంలో కనీసం 100 శాతం నుంచి మొదలుకొని గరిష్ఠంగా 227 శాతం వరకు పెరిగిన స్టాక్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. మొత్తం ఇందులో 13 స్టాక్స్ ఉన్నాయి. ఈ షార్ట్ పీరియడ్‌లోనే ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసిన ఆ కంపెనీల షేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ షేరు ధర 3 నెలల కిందట రూ. 170 వద్ద ఉండగా ఇప్పుడు రూ. 557 స్థాయికి చేరింది. ఈ క్రమంలో 3 నెలల్లో 227 శాతం పెరిగింది. దీంతో రూ. లక్ష పెట్టుబడి 3 నెలల్లోనే రూ. 3.27 లక్షలైంది. ఇండియా బుల్స్ షేరు ఈ క్రమంలో రూ. 11 నుంచి 30 కి ఎగబాకింది. షేర్ ధర 172 శాతం పెరిగింది. హెచ్ఎఫ్‌సీఎల్ షేరు కూడా 3 నెలల వ్యవధిలో రికార్డు స్థాయిలో 170 శాతం పుంజుకుంది.Read Also: మిగతా స్టాక్స్ చూస్తే సెమీఇండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ షేర్ ధర రూ. 605 నుంచి రూ. 1550 కి ఎగబాకింది. ఇది 156 శాతం పుంజుకుంది. స్టెరిలైట్ టెక్నాలజీస్ షేర్లు కూడా 150 శాతం పుంజుకున్నాయి. క్యుపిడ్ షేర్ ధర రూ. 92 నుంచి రూ. 210 కి చేరగా ఇక్కడ లక్షకు రూ. 2.27 లక్షలు వచ్చాయి. బాలాజీ అమైన్స్ షేర్లు 122 శాతం పెరగ్గా లక్షను రూ. 2.22 లక్షలు చేసింది. డీ డెవలప్‌మెంట్ ఇంజినీర్స్ షేర్లు కూడా 115 శాతం పెరగ్గా ఇన్వెస్టర్ల సంపద 3 నెలల్లో డబుల్ అయింది. టైమెక్స్ గ్రూప్ ఇండియా, ఏజెస్ లాజిస్టిక్స్, స్టాండర్డ్ ఇంజినీరింగ్, ఏక్వస్ (Aequs), బ్లిస్ జీవీఎస్ ఫార్మా, రాశి పెరిఫెరల్స్ స్టాక్స్ కూడా 102 శాతం నుంచి 109 శాతం వరకు పెరిగి సంపదను రెట్టింపు చేసిన వాటిల్లో ఉన్నాయి. అనిశ్చితిలోనూ 13 స్టాక్స్ ఇలా అద్భుత ప్రదర్శన చేయడం అనేది, కరెక్ట్ స్టాక్ సెలక్షన్‌ పవర్‌ను చూయిస్తోంది. Disclaimer: పాస్ట్ రిటర్న్స్ భవిష్యత్తుకు హామీ ఇవ్వవు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.