వారెవ్వా.. అద్విత్ జువెల్స్‌లానే ఈ ఐపీఓ కోసం కూడా ఎగబడ్డారుగా.. చివరి రోజు 136 రెట్లతో ఊచకోత!

Wait 5 sec.

: ప్రస్తుతం భారతీయ ప్రైమరీ మార్కెట్ సూపర్ ఫామ్‌లో నడుస్తోంది. మరో మెయిన్‌బోర్డ్ ఐపీఓ కుసుమ్‌గార్ ఇన్వెస్టర్లకు పూనకాలు తెప్పించింది. కేవలం రూ. 650 కోట్ల విలువైన ఈ ఐపీఓ ఆఫర్‌లో ఉన్నది కేవలం 1.08 కోట్ల షేర్లు అయితే చివరి రోజు నాటికి రికార్డు స్థాయిలో 147 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలు కావడం విశేషం. ఇది మార్కెట్ వర్గాల్నే ఆశ్చర్యపోయేలా చేసిందని చెప్పొచ్చు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs), బడా ఇన్వెస్టర్లు (NII) పోటీ పడి ఈ షేర్లను దక్కించుకునేందుకు ఎగబడ్డారు. మరి ఏ కేటగిరీలో ఎంత సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. గ్రే మార్కెట్లో ప్రీమియం ఎంత చూయిస్తుంది. ఈ లెక్కన ఎంత లాభాలు రావొచ్చు. పూర్తి వివరాల్ని చూద్దాం.మూడో రోజు అంటే జులై 10న బిడ్డింగ్ ముగిసే సమయానికి నమోదైన అధికారిక సబ్‌స్క్రిప్షన్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) 299 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇక్కడ దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ఊహించని డిమాండ్ కనిపించింది. బడా ఇన్వెస్టర్లు (NII) నుంచి 174 రెట్ల మేర రెస్పాన్స్ వచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మాత్రం 28 రెట్ల స్పందన వచ్చింది. అంటే సామాన్య ఇన్వెస్టర్ల నుంచి కూడా రెస్పాన్స్ భారీగానే ఉంది. ఇలా ఓవరాల్‌గా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ 136 రెట్లు వచ్చింది. 2026, జులై 13 నాటికి షేర్ల అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తి కానుంది. ఐపీఓలో షేర్లు దక్కని వారికి జులై 14న డబ్బులు రిఫండ్ అవుతాయి.షేర్లు దక్కిన వారికి అదే రోజున డీమ్యాట్ అకౌంట్లలో షేర్లు క్రెడిట్ అవుతాయి. జులై 15న అంటే బుధవారం రోజు బీఎస్‌ఈ, NSE లో లిస్టింగ్ కానుంది. అప్పటినుంచి ట్రేడింగ్‌కు అందుబాటులోకి వస్తుందన్నమాట. మార్కెట్ తాజా వర్గాల సమాచారం ప్రకారం గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 163 కి చేరింది. కంపెనీ నిర్ణయించిన ఇష్యూ ధర రూ. 419 తో పోలిస్తే ఇది దాదాపు 39 శాతం అదనపు ప్రీమియంను సూచిస్తోంది. ఈ లెక్కన స్టాక్ మార్కెట్లో సుమారు రూ. 580 పైనే లిస్టింగ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మొదటి రోజే బంపర్ లిస్టింగ్ గెయిన్స్ పక్కా అని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అద్విత్ జువెల్స్ దాదాపు 38 శాతం ప్రీమియంతోనే లిస్టింగ్ అయింది.