హైదరాబాద్‌లో మెగా రియల్ ఎస్టేట్ డీల్- రోజుకు 21 లక్షల అద్దె- అడ్వాన్స్ 38 కోట్లు!

Wait 5 sec.

: భారతదేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కమర్షియల్ ఆఫీస్ మార్కెట్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. తాజాగా గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ (HSBC) అనుబంధ సంస్థ అయిన హెచ్‌ఎస్‌బీసీ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీ కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. డేటా ఆధారిత రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ సేకరించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం- ఈ లీజ్ డీల్ విలువ, నిబంధనలు వింటే రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో జరిగిన ఈ సరికొత్త మెగా డీల్ వివరాల్ని ఇప్పుడు చూద్దాం. గచ్చిబౌలి- హైటెక్ సిటీ కారిడార్‌‍లోని అవాన్స్ బిజినెస్ హబ్‌లో గల ఫీనిక్స్ హెచ్ 09 భవనంలో ఈ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. మొత్తం 2,03,755 చదరపు అడుగుల (సూపర్ బిల్ట్ అప్ ఏరియా) స్థలాన్ని HSBC లీజుకు తీసుకుంది. ఇది భవనంలోని 8, 9వ లెవెల్స్ (3,4 వ ఆఫీస్ ఫ్లోర్లు) అంతటా విస్తరించి ఉంది. ప్రతి చదరపు అడుగుకు నెలకు రూ. 315 చొప్పున మొత్తం నెలవారీగా అద్దె రూ. 6.42 కోట్లుగా ఉంది. ఇక్కడ రోజుకు రూ. 21 లక్షల వరకు పడుతుందని చెప్పొచ్చు. 4 సంవత్సరాల 7 నెలల కాల పరిమితికిగానూ హెచ్ఎస్‌బీసీ అద్దె రూపంలోనే దాదాపు రూ. 388 కోట్లు చెల్లించనుంది. ఈ డీల్ కోసం కంపెనీ ఏకంగా రూ. 38.51 కోట్ల భారీ మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో అడ్వాన్స్ చెల్లింపు జరిపింది. ఈ సబ్ లీజ్ అగ్రిమెంట్లో మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంది. ప్రతి సంవత్సరం అద్దెలో 5 శాతం పెరుగుదల ఉంటుంది. Read Also: లీజ్ అగ్రిమెంట్లో భాగంగా మొత్తం 250 డెడికేటెడ్ పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. ఇందులో 204 స్లాట్లకు నెలకు రూ. 3500 చొప్పున, మిగిలిన 46 స్లాట్లకు రూ. 4500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో భారతదేశపు ఆఫీస్ స్పేస్ లీజింగ్ మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా 45.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు వెళ్లింది. దీంట్లో జీసీసీల వాటానే 43 శాతంగా ఉంది. బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో ఈ వృద్ధి ఎక్కువగా ఉంది. HSBC కంటే ముందు హైదరాబాద్‌లో అసెంచర్ ఇటీవల పదేళ్ల వ్యవధితో ఏకంగా 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇంకా టెక్ మహీంద్రా కూడా దాదాపు 4 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ దక్కించుకుంది.